Seethe Ramudi Katnam Serial Today Episode సీతకి నిజం చెప్పడానికి వచ్చిన రామ్‌ సీతకి నిజం ఎలా చెప్పాలా అని ప్రయత్నిస్తుంటాడు. సీత మాత్రం నా మామ శ్రీరామ చంద్రుడు వేరే అమ్మాయి నీడ కూడా  నా మామ మీద పడదు అని చెప్తుంది. దాంతో రామ్ మిథునతో తన పెళ్లి గురించి చెప్పలేకపోతాడు. మరో అమ్మాయి మెడలో నేను తాళి కడితే నువ్వేం చేస్తావ్ సీత నన్ను చంపేస్తావా అని రామ్ అడిగితే లేదు మామ నేనే ఉరి వేసుకొని చనిపోతా అని అంటుంది.

రామ్ చాలా కంగారు పడతాడు. ఇంకెప్పుడు అలా అనకు సీత ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను అంటాడు. దానికి సీత అలా ఎందుకు అవుతుందని మామ నువ్వు ఇంకెరి మెడలో తాళి కట్టలేదు కదా అంటుంది. రామ్ నిజం చెప్పలేక చూడటానికి వచ్చానని చెప్పి వెళ్లిపోతాడు. సీత రేవతి వాళ్లతో కొన్నాళ్లు మామ నా దగ్గర ఆ విషయం దాస్తాడు. ఈలోపు నేను మహాలక్ష్మీ అత్తయ్య అంతు చూస్తా అని అంటుంది. 

రామ్ ఇంకా రాలేదు ఏంటా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. రామ్ నిజం చెప్పడం విని గుండె పోటు వచ్చిందేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో రామ్ ఇంటికి వస్తాడు. అందరూ రామ్‌తో మిథునకు నీకు జరిగిన పెళ్లి కోసం సీతకి చెప్పావా అంటే రామ్ చెప్పలేకపోయానని అంటాడు. భయంతో చెప్పలేకపోయావా రామ్ అని మహాలక్ష్మీ అడిగితే బాధ్యతతో చెప్పలేకపోయాను పిన్ని అంటాడు.

రామ్: సీత దృష్టిలో నేను ఊహకు అందనంత ఎత్తులో గుడి కట్టుకుంటుంది. ఈ రోజు కూడా మేం త్వరగా కలవాలి అని పూజ చేసుకుంటుంది. నిజం తెలిస్తే సీత నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అందుకే ఈ విషయం చెప్పలేకపోయాను.మహాలక్ష్మీ: మనసులో సీత నీకు శాశ్వతంగా అవడం కోసమే నేను ఎదురు చూస్తున్నా.చలపతి: మరి ఈ పరిస్థితికి పరిష్కారం ఏంటి రామ్.రామ్: అదే నాకు అర్థం కావడం లేదు మిథునని వదులుకుందామని అంటే ముఖర్జీ అంకుల్ ఊరుకోరు. సీతకి నిజం తెలిస్తే సీత తట్టుకోలేదు. సీత దూరం అయితే నేను తట్టుకోలేను.మహాలక్ష్మీ: నువ్వు ఇప్పుడు మిథున భర్తవి రామ్ అంత ఆలోచించొద్దు.రామ్: మిథున కంటే ముందు సీత నా భార్య పిన్ని. నాతో కలిసి బతకడం కోసం ఫైట్ చేస్తుంది. అలాంటి సీత గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉండాలి.గిరి: మిథునతో మూవ్‌ ఆన్ అవ్వడం కంటే వేరే ప్లాన్ లేదు రామ్.జనార్థన్: మరి నేను కూడా మీ అమ్మ దూరం అయిన తర్వాత పిన్నిని పెళ్లి చేసుకున్నా మనం హ్యాపీగా ఉన్నాం కదా.రామ్: మీ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నాన్న. అమ్మ లేరని మీరు పిన్నిని పెళ్లి చేసుకున్నారు. కానీ సీత ఉండి కూడా నేను మిథున మెడలో తాళి కట్టాను. ప్రాణం పోతున్నట్లుంది డాడ్. అమ్మ ఉంటే నాకు ఏదైనా దారి చూపేది. చుట్టూ ఇంత మంది ఉన్నా నాకు ఒంటరిగా ఉన్నట్లుంది.జనార్థన్: మనం తొందరపడ్డామేమో మహా. అర్చన: ఏం కాదు బావగారు మిథున మొత్తం మార్చేస్తుంది.చలపతి: చిన్ని విషయానికే సీత వీరంగం సృష్టిస్తుంది. అలాంటిది తన భర్తకి మీరు పెళ్లి చేశారని తెలిస్తే ఊరుకుంటుందా. మీతో తాండవం ఆడేస్తుంది. జాగ్రత్తగా ఉండండి.

రామ్ రెండో పెళ్లి గుర్తు చేసుకున్న రేఖ అన్నీ విసిరేస్తుంది. గౌతమ్ ఆపుతాడు. మనకు ఒక్క పని కూడా అనుకూలంగా జరగలేదు. మీ అమ్మ తెలివిగా రామ్‌కి మిథునలకు పెళ్లి చేసింది. మన పెళ్లి గురించి పట్టించుకోవడమే లేదు. నాకు ఏం ఆస్తి లేదు అనుకుంటున్నారు కదా నా తెలివితో మీకు చుక్కలు చూపిస్తా. ముందు మనకు పెళ్లి చేయమను అప్పుడు నేను ఇంటి కోడలిగా చేయాల్సినవి చేస్తాను అప్పుడే నాకు ఆ హక్కులు వస్తాయి అంటుంది. నేను అమ్మతో మాట్లాడుతానని గౌతమ్ అంటాడు.  

మహాలక్ష్మీ పడుకొని ఉంటే సీత చాక్ తీసుకొని వస్తుంది. మహాలక్ష్మీ మీద నీరు వేసి లేపి చాక్‌చూపి నిన్ను చంపేస్తా అత్త అని అంటుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. నేనేం చేశా అని మహాలక్ష్మీ అంటే నువ్వు చేయని నేరాలు ఏం ఉన్నాయో చెప్పు వందల వేల నేరాలు చేశావని అన్నీ గుర్తు చేసి నీ పాపాలు నీ రక్తంతోనే కడిగేస్తా నిన్ను చంపేస్తా అని వెంటపడుతుంది. మహాలక్ష్మీ అందర్నీ పిలుస్తూ ఇళ్లంతా పరుగులు పెడుతుంది. సీత తనని పొడిచినట్లు మహాలక్ష్మీ కల కంటుంది. కంగారు పడి లేస్తుంది. జనార్థన్ ఏం కాదని మహాలక్ష్మీకి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!