Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తండ్రి ఫొటో చూస్తూ నాన్న మాట గొప్పదా? జీవితం గొప్పదా అని ఆలోచిస్తున్నా. మాట కోసం  నేను ఇప్పుడు సహస్రని పెళ్లి చేసుకుంటే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ కనకం జీవితాంతం బాధ పడుతుంది. నేను సహస్రను పెళ్లి చేసుకోను అంటే అత్తయ్య కోపంతో వెళ్లిపోతుంది. సహస్ర బాధపడుతుంది. అదే కనకాన్ని వదలాల్సి వస్తే అంత కంటే పాపం ఉండదు. ఏది ఏమైనా లక్ష్మీ వైపే నేను నిలబడతాను. ఇదే నా ఫైనల్ నిర్ణయం నాన్నా అంటారు. 

ఇంతలో యమున, లక్ష్మీలు వస్తారు. యమున ఏంటి నాన్న మన కుటుంబాలు కలవడం మీ నాన్న గారి కోరిక ఆ కోరిక తీరుతుందని మీ నాన్నకి చెప్తున్నావా. రెండు సార్లు పెళ్లి ఆగిపోయింది ఈ సారి ఎలా అయినా పెళ్లి జరిగిపోవాలి నాన్న దీని తర్వాత మనకు అన్నీ మంచి రోజులే అని యమున సంతోషపడుతుంది. ఇక విహారి కల్యాణ తిలకం పెట్టుకోకపోవడం గుర్తించి లక్ష్మీకి కల్యాణ తిలకం పెట్టమని అంటుంది. లక్ష్మీ విహారికి కల్యాణ తిలకం పెడుతుంది. విహారి లక్ష్మీనే చూస్తూ ఉంటాడు. నీ చేత నువ్వే నీ భర్తని పీటల మీదకు పంపుతున్నావ్ నీకు బాధగా లేదా అనుకుంటాడు. యమున కొడుకుని చూసి మురిసిపోతుంది. 

సహస్రతో గౌరీ పూజ చేయిస్తారు. తర్వాత గణపతి పూజ కోసం విహారిని తీసుకురమ్మని పిలుస్తారు. విహారిని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. విహారి కాళ్లను అత్తామామలు కడగాలి అని ఆ ఏర్పాట్లు చేయమని అంటే లక్ష్మీ బిందె వాటిని తీసుకొస్తుంది. పద్మాక్షి, ఆమె భర్త సంతోషంగా కన్యాదానం చేస్తారు. పద్మాక్షికి పందిరిపై లక్ష్మీ తగలడంతో పక్కకు వెళ్లిపోమని చెప్తుంది. విహారికి పెళ్లి బట్టలు పెడతారు. వాటిని మార్చుకురమ్మని పంతులు చెప్తారు. విహారి ఫ్రెండ్ సత్య రావడంతో విహారి సత్య ఇద్దరూ వెళ్తారు. అంబిక సహస్రతో ఆ లక్ష్మీని పెళ్లికి దూరంగా ఉంచు అది ఇక్కడే ఉంటే ఏదో ఒక రకంగా ఆ పెళ్లి ఆపేస్తుందని అంటుంది. అది ఆపలేదు అని సహస్ర అంటే అది దాన్ని అవకాశంగా తీసుకొని ఏదో ఒకటి చేస్తుంది నా మాట విని లక్ష్మీని దూరం పెట్టు అని అంటుంది. 

విహారి, సత్య మాట్లాడుకుంటూ ఉంటూ సహస్ర తన కాబోయే బావ కోసం బ్రాస్‌లెట్ తీసుకొని వెళ్తుంది. సత్య విహారితో లక్ష్మీకి న్యాయం చేయాలి అన్నావ్ ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తున్నావో అర్థమైందా అని అడుగుతాడు. దానికి విహారి అన్నీ వైపుల నుంచి ఆలోచించానురా నాకు ఒక పరిష్కారం దొరికింది అందరికీ నాకు లక్ష్మీకి పెళ్లి అయింది అని చెప్పి పెళ్లి ఆపుతానని అంటాడు. మీ వాళ్లు తట్టుకోలేరు కదరా మీ అత్తయ్య ఒప్పుకోదు కదా అని సత్య అంటే తప్పుదురా ఇంతకు మించి మరో అవకాశం లేదని విహారి అంటాడు. ఆ మాట విని సహస్ర ఏడుస్తూ కింద కూలపడిపోతుంది. బావ నిజం చెప్తే ఎంత గొడవ అయినా చివరకు బావని లక్ష్మీని కలుపుతారు. అందుకే బావ నోరు విప్పకూడదు అని ఏడుపు దిగమింగుకొని సంతోషంగా విహారి దగ్గరకు వెళ్లి చేతికి బ్రేస్‌లెట్ పెట్టి చేతిని ముద్దాడి ఐలవ్‌యూ బావ అని చెప్తుంది. 

విహారితో ఈ మాట నీకు ఎప్పుడో చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నీతోనే నా జీవితం అనుకున్నప్పటి నుంచి  మన కొత్త జీవితం కోసం ఎదురు చూశాను. ఇప్పటికే రెండు సార్లు మన పెళ్లి ఆగిపోయింది. ఈ సారి మన పెళ్లి ఆగిపోదు అనకుంటున్నా ఈ సారి ఆగిపోతే నేను తట్టుకోలేను బావ అని చెప్తుంది. సహస్ర వెళ్లిపోయిన తర్వాత సత్య నువ్వు పెళ్లి ఆపేస్తా అంటున్నావ్ సహస్ర మాటలు వింటే తను ఏమైపోతుందో అని భయంగా ఉందని అంటాడు. విహారి మళ్లీ ఆలోచనలో పడతాడు. ఇక సహస్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఈ పెళ్లి ఆపడానికి ఏం చేస్తున్నావ్ అంటుంది. నేనేం చేయడం లేదని లక్ష్మీ అంటుంది. సహస్ర లక్ష్మీని వెళ్లిపోమని చెప్తుంది. ఇంతలో పద్మాక్షి కూడా వస్తుంది. లక్ష్మీని వెళ్లిపోమని చెప్తే వెళ్లడం లేదని అంటుంది. నేను పెళ్లి ఆపను అని లక్ష్మీ అంటుంది. పద్మాక్షి లక్ష్మీని బయటకు గెంటేస్తుంది. లక్ష్మీని బయటకు పంపడం చూసిన విహారి లక్ష్మీని ఆపాలి అనుకుంటాడు. తల్లితో విషయం చెప్తాడు. విహారి, సహస్రల్ని పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!