Pakistan Defence Minister Says they hacked IPL floodlights: భారత్ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ నాయకులు తెగ చెప్పుకున్నారు. కానీ వారి ఎయిర్ బేస్‌లన్నీ కొట్టుకుపోయానని మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పుడు కొత్తగా మరో విచిత్రాన్ని చెప్పుకుంటున్నారు. భారత్ లో ఐపీఎల్ జరిగేటప్పుడు ఫ్లడ్ లైట్లను హ్యాక్ చేశామని..సైబర్ ఎటాక్ చేసి డ్యాం గేట్లను ఓపెన్ చేశామని పాకిస్తాన్ రక్షణ మంత్రి పార్లమెంట్ లో చెప్పుకున్నారు. ఆ వీడియో పాకిస్తాన్ ప్రజల మైండ్ బ్లాంక్ చేసింది. ఇండియాలోనూ వైరల్ గా మారింది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ హ్యాకర్లు భారతదేశంలోని IPL ఫ్లడ్‌లైట్లు , డ్యామ్ గేట్లను సైబర్ దాడి ద్వారా హ్యాక్ చేశారని చెప్పడం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో విస్తృత చర్చనీయాంశంగా మారింది. 2025 జూన్ 14న పాకిస్తాన్ పార్లమెంట్‌లో చేశారు.
IPL 2025 సీజన్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా మే 8, 2025న తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ మే 17న పునఃప్రారంభమైంది. ఈ సమయంలో ఫ్లడ్‌లైట్ల హ్యాకింగ్ చేశామని పాక్ రక్,ణ మంత్రిచెబుతున్నారు. అసలు ఫ్లడ్ లైట్లను ఎలా హ్యాక్ చేస్తారో మాత్రం ఆయన చెప్పలేదు.
నెటిజన్లు పార్లమెంట్‌ను "స్టాండ్-అప్ కామెడీ క్లబ్"గా టీజ్ చేస్తున్నారు. తదుపరి పాకిస్తాన్ చంద్రయాన్‌ను హ్యాక్ చేసి మంగళ గ్రహానికి విద్యుత్ సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు.