Pak Navy fled from Karachi during Op Sindoor: ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని .. దాడులు ఆపేయండి మహా ప్రభో అని వేడుకుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే పాకిస్తాన్ లో మాత్రం అక్కడి ప్రభుత్వం ఓవరాక్షన్ బాగానే చేస్తోంది. ఈ క్రమంలో భారత దాడుల దెబ్బకు భయపడి పాక్ నేవీ ఎలా పారిపోయిందో శాటిలైట్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రముఖ మీడియా సంస్థ ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) బృందం విశ్లేషణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ, గ్వాదర్ ఓడరేవుల ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నేవీ ఎలా పారిపోయిందో నిర్దారించాయి. భారత్ సైన్యం మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నప్పుడు ఉపగ్రహ చిత్రాల ప్రకారం, పాకిస్తాన్ నేవీ (PN) యుద్ధనౌకలను కరాచీలోని వారి నావల్ డాక్‌యార్డ్ నుండి తరలించి వాణిజ్య టెర్మినల్స్ వద్ద డాక్ చేశాయి. అంటే .. వాణిజ్య నౌకల వద్ద అయితే దాడులు చేయరని.. అలా తమ యుద్ధ నౌకల్ని కాపాడుకున్నారు.
ఇతర యుద్ధనౌకలు భారతదేశం వైపు తూర్పు వైపు ప్రయాణించే బదులు ఇరాన్ సరిహద్దు నుండి కేవలం 100 కి.మీ దూరంలో గ్వాదర్‌లో పోర్టుకు తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ నావికాదళం ఇలా చేయడం పారిపోవడమేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. "మే 07న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరిగింది . అయినా పాకిస్తాన్ దళాల మూడు విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. కానీ ఫ్రంట్ లైన్ పాక్ యుద్ధనౌకలు నౌకాశ్రయంలోనే ఉండటం వారి వైఫల్యానికి నిదర్శనం " అని 1971లో కరాచీ నౌకాశ్రయంపై జరిగిన సాహసోపేత దాడిలో పాల్గొన్న దక్షిణ నావికాదళ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ SC సురేష్ బంగారా విశ్లేషించారు.
పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలన వాణిజ్య విమానాల చాటున రక్షణగా ఉంచుకున్నాయి. అలాగే యుద్ధ నౌకల్ని వాణిజ్య నౌకల మధ్య ఉంచుకుని కాపాడుకున్నాయి. భారత్ దాడులు చేసి ఉంటే వారి పౌర ఆస్తులకు ధ్వంసం అయి ఉండేవి. అంటే పాకిస్తాన్ తన పౌరుల్ని బలి చేయాలని అనుకుంది. వారి ఆస్తులను సైతం బలి పెట్టాలనుకుంది. ఆపరేషన్ సిందూర్ కు ఆరు నెలల ముందు, పాకిస్తాన్ నావికాదళం స్వదేశీంగా అభివృద్ధి చేసిన P282 నౌక-ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి తమ అమ్మలపొదిలో చేరిందని ప్రకటించుకుంది. కానీ యుద్ధంలో అలాంటివేమీ ఉపయోగించలేకపోయారు. అవి ఉపయోగించే సామర్థ్యం ఉన్న యుద్ధ నౌకను .. గ్వాదర్ ఎయిర్ పోర్టుకు తరలించుకున్నారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌కు కీలకంగా చెప్పుకునే ఈ ఓడరేవును తాత్కాలిక నావికాదళ ఆశ్రయంగా మార్చారు.
మే 10 నాటికి, గ్వాదర్ ఎయిర్ పోర్టు కంటైనర్ నిల్వ ప్రాంతం ఖాళీగా ఉంది. కానీ పోర్టు మాత్రం సైనిక ఆయుధాలుతో నిండిపోయాయి: రెండు జుల్ఫిక్వార్-క్లాస్ ఫ్రిగేట్‌లు, పాకిస్తాన్‌లో అతిపెద్ద టగ్రిల్-క్లాస్ ఫ్రిగేట్‌లలో రెండు, నావికాదళం ఏకైక US-నిర్మిత ఆలివర్ హజార్డ్ పెర్రీ-క్లాస్ ఫ్రిగేట్ మ, రెండు సముద్ర గస్తీ నౌకలు అక్కడ ఉన్నాయి. అవన్నీ భారత్ పై దాడి చేయడానికి కాదు. కేవలం భారత్ నుంచి దాడులు చేయడానికే. భారతదేశం, ఒక క్లాసిక్ ఉమ్మడి ఆపరేషన్‌ను ప్లాన్ చేసి అమలు చేసిన తర్వాత, ఆపరేషన్ సిందూర్ అన్ని లక్ష్యాలను సాధించగలిగింది. సముద్రం నుండి ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించకుండానే వేగవంతమైన ఆపరేషన్‌ను ముగించింది. అవసరమైతే కరాచీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని భారత నావికాదళం గతంలో తెలిపింది. కానీ పాకిస్తాన్ చాలా తెలివిగా తన నావికాదళాన్ని పారిపోయేలా చేసి.. సురక్షిత ప్రాంతానికి చేరుకునేలా చేసింది. ఇలా పారిపోవడం కూడా విజయమేనని పాకిస్తాన్ అనుకుంటోంది.