Operation Sindoor Women Soldiers On KBC: కౌన్ బనేగా కరోడ్‌పతి  (KBC)  తాజా ఎపిసోడ్‌లో భారత సైన్యం మహిళా  అధికారులు  పాల్గొన్నారు. వీరు యూనిఫామ్‌లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో "ఆపరేషన్ సిందూర్" ను ప్రచారం చేయడానికి షోలో పాల్గొన్నారన్న విమర్శలు  వస్తున్నాయి. 

సైనిక అధికారులు యూనిఫామ్‌లో టెలివిజన్ షోలో పాల్గొనడం భారత సైన్యం  నియమాలను  ఉల్లంఘించినట్లన్న ఆరోపణలు వస్తున్నాయి.  సైన్యం గౌరవాన్ని రాజకీయ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని  అంటున్నారు. ఇలా పాల్గొనడాన్ని  "అనైతికం" , "సైన్యం   పవిత్రతను దిగజార్చే చర్య"గా  పలువురు విమర్శిస్తున్నారు.  

  ప్రైవేటు టెలివిజన్ విడుదల చేసిన  ప్రమోషనల్ క్లిప్‌లో ఆర్మీ అధికారులు బిగ్గరగా చప్పట్లు కొడుతూ సెట్‌లోకి నడుస్తున్నట్లు చూపిస్తుంది. ప్రసారం ఆగస్టు 15న జరగనుంది. ఎపిసోడ్‌లో, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన సరిహద్దు సైనిక దాడి అయిన ఆపరేషన్ సిందూర్  విషయాలను వారు పంచుకున్నారు.  

ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు కల్నల్ ఖురేషి , యు వింగ్ కమాండర్ సింగ్ ఇద్దరూ  మీడియా బ్రీఫింగ్ ఇచ్చేవారు.  వారు ఒక వినోద కార్యక్రమంలో కనిపించడం విశేషంగా భావిస్తున్నారు. సాయుధ దళాల ప్రోటోకాల్ అటువంటి బహిరంగ ప్రదర్శనలను అనుమతిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. “భారత సాయుధ దళాలకు ప్రోటోకాల్ మరియు గౌరవం ఉన్నాయి. రాజకీయ నాయకులు వ్యక్తిగత లాభం కోసం దానిని నాశనం చేస్తున్నారు” అని ఒక రు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.[ 

అయితేఇది కావాలని వ్యతిరేకించడమేనని గతంలోనూ ఇలా ఆర్మీ ఆఫీసర్లు పాల్గొన్నారని కొంత మంది గుర్తు చేస్తున్నారు.