H3N2 Virus in Assam:


అలెర్ట్..


దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్, గుజరాత్, ఒడిశాలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రమైన అసోంలోనూ  H3N2 కేసు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అసోం ఆరోగ్య విభాగం అధికారికంగా ప్రకటించింది. అప్రమత్తమైన అధికారులు బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. రాష్ట్రంలోని ఫ్లూ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.  Integrated Disease Surveillance Programme (IDSP)నెట్‌వర్క్‌లో భాగంగా అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ఈ సవాలుని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సహా ICMR ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపింది. ప్రస్తుతానికి కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి ప్రభావం తక్కువగానే ఉందని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు కేంద్రం కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది.