Railway Works: ఏపీ, తెలంగాణలో పలు అభివృద్ది పనులకు ఈ నెల 26వ తేదీన ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) శంకుస్థాన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్దిలో భాగంగా ఏపీలో 34, తెలంగాణ (Telangana)లో 15 రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. వీటి కోసం రూ.843.54 కోట్లను కేటాయించారు. ఆ రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు 16న మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో బాసర, బేగంపేట, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్ నగర్, ఉదానగర్, వికారాబాద్, వరంగల్, యాకూత్‌పూరా స్టేష్లను ఎంపిక చేశారు. వీటి అభివృద్ది కోసం రూ.230.24 కోట్లు కేటాయించారు.
ఇక ఏపీ విషయానికొస్తే..
అదోనీ, అనంతపురం, అనపర్తి, బాపట్ల, చీరాల, చిత్తూరు, కుంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె, మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికూడి, నంద్యాల, నర్సరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకొట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వేస్టేషన్లను ఎంపిక చేశారు. వీటి కోసం రూ.610.30 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. దేశవ్యాప్తంగా 500పైగా అమృత్ భారత్ స్టేషన్లకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లకు భూమిపూజ చేసి జాతికి అంకితం చేయనున్నారు.
తెలంగాణలో కార్యక్రమాలు..
తెలంగాణలో 17 రైల్ ఫ్లైఓవర్లు, అండ్ పాస్‌లకు శంకుస్థాపన చేయనుండగా.. ఇప్పటికే పూర్తి చేసిన 32 రైల్ ఫ్లైఓవర్లు, రైల్ అండర్‌పాస్‌లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి కోసం రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిల్లో భాగంగా రూ.847 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న 21 అమృత్ భారత్ స్టేషన్లకు గత ఏడాది ఆగస్టులో మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరో 15 స్టేషన్లలో అభివృద్ది పనులకు 26న భూమిపూజ నిర్వహించనున్నారు. మోదీతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తెలంగాణలో జడ్చర్ల రైల్వేస్టేషన్ కోసం రూ.10.94 కోట్లు, గద్వాల్‌కు రూ.9.49 కోట్లు, షాద్‌నగర్‌కు రూ.9.59 కోట్లు, మేడ్చల్ రైల్వేస్టేషన్‌కు రూ.8.37 కోట్లు, మెదక్‌కు రూ.15.31 కోట్లు, ఉందానగర్ స్టేషన్ కోసం రూ.12.37 కోట్లు, బాసర స్టేషన్ కోసం రూ.11.33 కోట్లు, యాకుత్‌పుర రైల్వే స్టేషన్ కోసం రూ.8.53 కోట్లు, మిర్యాలగూడ స్టేషన్ కోసం రూ.9.50 కోట్లు, నల్లగొండ రైల్వే ష్టేషన్‌కు రూ.9.50 కోట్లు, వికారాబాద్‌కు రూ.24.35 కోట్లు, పెద్దపల్లికి రూ.26.49 కోట్లు, మంచిర్యాల స్టేషన్ కోసం రూ.26.49 కోట్లు, వరంగల్ రైల్వేస్టేషన్ కోసం రూ.25.41 కోట్లు, బేగంపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ది కోసం రూ.22.57 కోట్లు కేటాయించారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యం లిఫ్ట్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ సౌకర్యం, సీసీటీవీ, ఎస్కలేటర్లు ఏర్పాటు, ఇల్యూమినేషన్, సైన్ బోర్డుల ఏర్పాటు వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు రైల్వేస్టేషన్లలో అనేక పనులు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.