Omicron Variant:


ఆ సబ్‌ వేరియంట్‌తో..


ఒమిక్రాన్‌ వేరియంట్‌తో మరో  వేవ్ వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కొన్ని దేశాల్లో ఇంకో కొవిడ్ వేవ్ వచ్చే అవకాశముందని చెప్పారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు. డెవలపింగ్ కంట్రీస్ వ్యాక్సిన్ మ్యానుఫాక్చర్స్ నెట్‌వర్క్ (DCVMN)జనరల్ మీటింగ్‌లో మాట్లాడిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వేవ్ వస్తుందన్న అంచనాలున్నప్పటికీ...అది తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందనటానికి ఎలాంటి క్లినికల్ ఎవిడెన్స్‌లు లేవని వెల్లడించారు. "ఒమిక్రాన్‌కు 300 సబ్‌ వేరియంట్‌లున్నాయి. వీటిలో కాస్తో కూస్తో ప్రమాదకరమైందంటే XBB వేరియంట్. ఇది రీకాంబినెంట్ వైరస్. గతంలోనూ ఇలాంటి వైరస్‌లు వ్యాప్తి చెందాయి. ఇమ్యూనిటీని ఛేదించి మరీ వ్యాప్తి చెందే గుణం ఉంటుంది. యాంటీబాడీలనూ దాటుకుని వస్తుంది. అందుకే..XBB వేరియంట్‌తో మరో వేవ్ వస్తుండొచ్చు" అని సౌమ్య స్వామినాథ్ స్పష్టం చేశారు. BA.5,BA.1 డెరివేటివ్స్‌లనూ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్టు చెప్పారు. ఇవి కూడా ఇమ్యూనిటీని ఛేదించి వ్యాప్తి చెందే అవకాశముందని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి వేగం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే...ఏ దేశంలో కొత్త వేవ్ వస్తుందన్న సమాచారం ప్రస్తుతానికి లేదని చెప్పారు. 


టీకాలుండటం సంతోషకరం..


"నిత్యం మనం వైరస్‌ ప్రవర్తనను గమనిస్తూనే ఉండాలి. చాలా దేశాల్లో వైరస్ టెస్టింగ్ ప్రక్రియను నిలిపివేశారు. అంతా ప్రశాంతంగా ఉందని అధ్యయనాలనూ చేయటం లేదు. ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయాల్సిన అవసరముంది. తద్వారా కొత్త వేరియంట్‌లు ఏం వస్తున్నాయో తెలుసుకునే అవకాశముంటుంది" అని సౌమ్యస్వామినాథన్ స్పష్టం చేశారు. ఇప్పటికీ కొవిడ్‌ని అంతర్జాతీయ ముప్పుగానే పరిగణించాలని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనాను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగానే పరిగణిస్తోందని అన్నారు. "అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దు. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతానికి మన వద్ద కరోనాను కట్టడి చేసే ఆయుధాలెన్నో ఉండటం సంతోషకరం. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవటం మంచిదైంది" అని తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారందరికీ 100% టీకాలు ఇవ్వాలని సూచించారు. 


ఈ వేరియంట్‌తోనూ ప్రమాదమే..


పరిస్థితులు చక్కబడ్డాయనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్లో ప్రమాదకరమైన వేరియంట్ BF.7 పుట్టుకొచ్చింది. దీని తొలికేసు చైనాలోని మంగోలియా ప్రాంతంలో బయటపడ్డాయి. ఇప్పుడక్కడ ఈ వేరియంట్ బారిన పడిన కేసులు పెరుగుతున్నాయి.అక్కడ్నించి ఈ వేరియంట్ ఇప్పటికే ఎన్నో దేశాలకు ప్రయాణం కట్టింది. ఇంకా మనదేశం చేరలేదులే అనుకుంటున్న సమయంలో ఓ కేసు బయటపడింది. ఆ వ్యక్తి లక్షణాలన్నీ BF.7 వేరియంట్ అని అనుమానించేలా ఉన్నాయి. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఈ కొత్త కేసును గుర్తించింది. ఇది 
వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న వేరియంట్ గా చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. దీపావళి ముందు ఈ వేరియంట్ భారత్ లో అడుగుపెట్టడం కాస్త కలవరపెట్టే విషయమే. ఎందుకంటే దీపావళికి బంధువులు,స్నేహితులు ఒకేచో గుమిగూడడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి BF.7 వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తద్వారా BF.7 వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను సందర్శించిన మోదీ- పలు ప్రాజెక్టులకు శ్రీకారం