Odisha Train Accident:



ట్విటర్‌లో విమర్శలు..


రైలు ప్రమాదాలపై ఆర్నెల్ల క్రితమే కాగ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. పట్టాలు తప్పడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్‌లు జరుగుతున్నట్టు తేల్చి చెప్పింది. ఒడిశా రైలు ప్రమాదంతో ఈ రిపోర్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే..దీనిపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఆర్నెల్ల ముందే కాగ్ రిపోర్ట్ ఇచ్చినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. ఇది కేవలం మోదీ సర్కార్ నిర్లక్ష్యమేనని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇదే విషయమై ట్విటర్‌లో విమర్శలు చేసింది. ప్రమాదం జరిగి 24 గంటలు దాటిపోయిందని...ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ ఇచ్చినా ఎందుకు అప్రమత్తం కాలేదని మండి పడ్డారు.


"ఈ ఘోరమైన ప్రమాదం జరిగి 24 గంటలు దాటిపోయింది. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఉన్నతాధికారులకు ఏ మాత్రం బాధ్యత లేదా..? నిపుణులు, పార్లమెంటరీ కమిటీ, కాగ్‌ ఇచ్చిన రిపోర్ట్‌లు, సలహాలను ఎందుకు పట్టించుకోలేదు? కీలకమైన ప్రాంతాలకు సరైన నిధులు కేటాయించలేదు. ఖాళీగా ఉన్న పోస్ట్‌లనూ భర్తీ చేయలేదు. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? లాల్‌బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్, మాధవ్ రావ్ సింధియాలా నైతిక బాధ్యత తీసుకుని రైల్వే మంత్రి ఎందుకు రాజీనామా చేయకూడదు" 


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ