Nurse Fends Off Gang Rape Attempt Cuts Doctors Private Parts With Blade :  కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం  జరుగుతూండగానే ఇంకా పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి ప్రయత్నించాడో డాక్టర్. కానీ ఆ నర్సు ఓనర్ అనో.. డాక్టర్ అనే భయపడలేదు. సర్జికల్  బ్లేడ్ తీసుకుని ప్రైవేటు పార్ట్ కోసేసింది.      

  


ఆస్పప్తిరోల పని చేసే నర్సుపైనే అఘాయిత్యానికి ప్రయత్నం 


బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో డాక్టర్ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. అందులో పని చేసేందుకు కొంత మంది నర్సుల్ని నియమించుకున్నారు. బుధవారం ఎప్పట్లాగే క్లినిక్ సమయం ముగిసిన తర్వాత అందరూ వెళ్లిపోయారు. ఓ నర్సుకు మాత్రం.. ఎక్కువ పని చెప్పి ఉండిపోయేలా చేశారు. ఆ నర్సు పని చేస్తున్న సమయంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి డాక్టర్ సంజయ్ కుమార్ మద్యం తాగాడు. తర్వాత నర్సుపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మిగతా ఇద్దరు సహకరిస్తుండగా.. ఆ నర్సుపై బలత్కారం చేయబోయాడు. 


నేనో సీరియల్ డేటర్‌ని... చాలా మందితో రిలేషన్‌లో ఉన్నా - రెజీనా షాకింగ్ కామెంట్స్


సర్జికల్ బ్రేడ్‌తో డాక్టర్ ప్రైవేటు పార్ట్స్ కట్                


అయితే ఆ నర్సు మాత్రం ప్రతిఘటించింది. తనకు జీతం ఇచ్చే వ్యక్తి అియనా.. డాక్టర్ అయినా సరే తనపై లైంగిక దాడి విషయంలో గట్టిగా ప్రతిఘటించింది. అయినా డాక్టర్ తన దుస్తులు తీసి.. ఆమెపై అత్యాచానికి  ప్రయత్నించాడు. ఆ సమయంలో తన చేతికి అందిన సర్జికల్ బ్లేడ్ తీసుకున్న నర్సు.. డాక్టర్ ప్రైవేటు పార్టుపై దాడి చేసింది. దాంతో.. డాక్టర్ ప్రైవేటుపార్టుక తీవ్ర గాయం అయి రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని స్నేహితులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత నర్సే పోలీసులకు సమాచారం ఇచ్చింది.                           


వేణు స్వామిపై కేసు నమోదుకు కోర్టు - పట్టువదలని జర్నలిస్ట్ మూర్తి వల్లే !  


బీహార్‌లో మద్య నిషేధం - అయినా ఆస్పత్రిలో మద్యం 


విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ తో పాటు అఘాయిత్యానికి ప్రయత్నించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఆస్పత్రిలో ఉన్నాడు. మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అత్యాచారం చేయాలన్న ఉద్దేశంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే  ఆ సీసీ టీవీ  ఫుటేజీల్ని ఆపేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్పత్రి నుంచి పోలీసులు మద్యం సీసాను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిజానికి బీహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యం కలిగి ఉండటం కూడా నేరమే.