Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి

Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 28 May 2022 02:43 PM
Nalgonda Crime: రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు భక్తులు మరణించగా, మరో నలుగు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

వైసిపి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నా: అన్నాబత్తుని శివకుమార్

గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీ చౌక్ లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్,
బీసీ అధ్యక్షుడు కేశన.శంకర్రావు,తదితరులు. వైసిపి ఎమ్మెల్యే గా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఎన్టీఆర్ సామాజిక విప్లవ వాది. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకొచ్చింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ తర్వాత పాలించిన వారు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. తిరిగి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తుంది జగన్ మోహన్ రెడ్డే. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేది జగన్ నాయకత్వంలోని వైసిపినే అని పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని కేసీఆర్ నడుస్తున్నారు: మోత్కుపల్లి

భూ స్వాములు పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్ టి ఆర్ అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. పెంకుటు ఇల్లు పరిచియం చేసిందీ మహ నాయకుడు, ఎన్ టి ఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని కేసీఆర్ నడుస్తున్నారని చెప్పారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకి అన్ని చేరుకోవాలి. ఈ దళిత బంధు కూడా అలాంటిదేనన్నారు. వాస్తవానికి పెళ్లి నాటికి అర్థ రూపాయ లేదని.. తన పెళ్లి కి వచ్చి భోజనం చేసి నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తుకు చేసుకున్నారు మోత్కుపల్లి.

NTR Birth Anniversary: ప్రపంచ ఖ్యాతి గడించిన తెలుగు బిడ్డ ఎన్టీఆర్: మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి: ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్. టి. అర్


- అయన అదేశాలు మేరకు అభిమానులు పని చేస్తున్నారు


- అయన ప్రధాని మంత్రి అవ్వాల్సింధి.. జస్ట్ లో మిస్స్ అయింది


- ఎన్. టి.అర్ కి భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం

RGV Complaint In Punjagutta PS: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్‌లో RGV ఫిర్యాదు

హైదరాబాద్: నట్టి క్రాంతి, నట్టి కరుణ పై పంజాగుట్టలో టాలీవుడ్ డైరెక్టర్ Rgv ఫిర్యాదు చేశారు. తన సైన్ ను ఫోర్జరీ చేశారు అని పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇష్టం సినిమాకు సంబంధించిన లేటర్ రేట్ పై తన సంతకం ఫోర్జరీ చేశారు అని rgv ఆరోపించారు. నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఫిర్యాదు చేశారు.

TET 2022 Postpone Demand: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, ఉద్రిక్తత

తెలంగాణలో టెట్ పరీక్ష (TS TET 2022)ను వాయిదా వేయాలని డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. నేడు పలువురు ఎన్‌ఎస్‌యూఐ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు మంత్రి సబిత ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సబిత ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా, ఎన్‌ఎస్‌యూఐ నేతలు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


వివాదం ఏంటంటే.. 
తెలంగాణలో టెట్ పరీక్షను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఏ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. టెట్ పరీక్ష రాయాల్సిన రోజే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పరీక్ష ఉన్నందున, TET వాయిదా వేయాలని డిమాండ్లు వచ్చాయి. అయినా పరీక్ష వాయిదా వేసే ఆలోచన లేదని, అభ్యర్థులు పూర్తిగా సిద్ధం కావాలని మంత్రి సబిత ఇటీవల క్లారిటీ ఇచ్చారు. 

Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ బతికుంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని: రాజేంద్రప్రసాద్

హైదరాబాద్: జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌కు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ నివాళులర్పించారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయన ద్వారా నేను మద్రాస్ ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యాను. నాకు అయన దేవుడు. మా ఇంట్లో ఒక మనిషి అయన, మీ తోటి ఉన్న వారిలో పది మంది కి సహాయం చెయ్యండి అదే ఆయనకు ఘన నివాళి అన్నారు.


- కొన్ని ఏళ్లు అయన పక్కన ఉన్న వ్యక్తినీ. సమాజమే దేవాలయం..అన్న మనిషి అతను. మన కళ్ళ ముందు మనం చూసిన దేవుడు అయన. ఈరోజు మా పెద్దాయన బతికి ఉండి ఉంటే బంగారు పూలు తో పాద పూజ చేసేవాడిని. అలాంటి జన్మ మళ్ళీ తెలుగు ప్రజలు ఎప్పుడు చూస్తారో అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

NTR Statue In Nimmakuru: నిమ్మకూరులో 35 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం: బాలక్రిష్ణ

తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ  బాలక్రిష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆపై, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. సామాజికం, పౌరాణికం, ప్రతికూల పాత్రలను సైతం పోషించి మెప్పించారు. శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పౌరాణికం, నాటకాలు, సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినీ కెరీర్ ‌లో 300 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు.


35 అడుగుల యన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే తనువు పులకిస్తుందన్నారు. ఆయన శత జయంతిని అందరూ  స్వచ్చందంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్వగ్రామం నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు తీర్మానించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహం కడతారని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు  అని ఎన్టీఆర్ నినదించారు, సామాన్యలను సైతం చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. 

Balakrishna pays tribute to NTR: నిమ్మకూరులో తండ్రి ఎన్టీఆర్‌కు బాలక్రిష్ణ ఘన నివాళి

స్వర్గీయ ఎన్టీఆర్ 99వ జయంతి వేడులకు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ హీరో నందమూరి బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం  ఆనందంగా  ఉందన్నారు. తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరులు లాంటి వారని, ఎన్టీఆర్‌ ఇల్లే ఒక నటనాలయం, ఆయన అందరి గుండెల్లో ఉన్నారన్నారు నటుడు బాలక్రిష్ణ. మరోవైపు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. 

NTR Jayanthi: తాతయ్య ఎన్టీఆర్‌కు కళ్యాణ్ రామ్, తారక్ నివాళులు

ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గల ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మహానాయకుడి నివాళులు అర్పించడం ఆనవాయితీ. హరికృష్ణ కుమారులు, ప్రముఖ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు. తారక్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చారు. కారును తారక్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. 

Background

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ 99వ జయంతి వేడులకు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ హీరో బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం  ఆనందంగా  ఉందన్నారు. తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరులు లాంటి వారని, ఎన్టీఆర్‌ ఇల్లే ఒక నటనాలయం, ఆయన అందరి గుండెల్లో ఉన్నారన్నారు నటుడు బాలక్రిష్ణ.


సామాన్య రైతు నుంచి సీఎం దాకా..
తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ  బాలక్రిష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆపై, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. సామాజికం, పౌరాణికం, ప్రతికూల పాత్రలను సైతం పోషించి మెప్పించారు. శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పౌరాణికం, నాటకాలు, సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినీ కెరీర్ ‌లో 300 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు.


35 అడుగుల యన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే తనువు పులకిస్తుందన్నారు. ఆయన శత జయంతిని అందరూ  స్వచ్చందంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్వగ్రామం నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు తీర్మానించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ విగ్రహం కడతారని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు  అని ఎన్టీఆర్ నినదించారు, సామాన్యలను సైతం చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. 


నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదివరకే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా ఏపీ, తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాయి. ఇండోనేషియా భూకంపం వల్ల సునామీ ఏర్పడినా మన దేశాన్ని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.  దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.


పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన  బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.110 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర రూ.600 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,600కి ఎగబాకింది.


ఏపీలో పెరిగిన బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 28th May 2022 2022)  10 గ్రాముల ధర రూ.52,090 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. రూ.600 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.66,600 కి చేరింది.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.