Mamata Banerjee On Top Court Order: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేది లేదంటున్నారు.  బెంగల్ లో పాతిక వేల మంది టీచర్లు అక్రమంగా ఉద్యోగం సంపాదించారని వారి నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బెంగాల్‌లో కలకలం ప్రారంభమయింది. తన కంఠంలో ప్రాణం ఉండగా మీకెవరికి అన్యాయం జరగనివ్వనని టీచర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  గతంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని తేల్చారని ఎందుకు ఆ పరీక్ష మొత్తాన్ని రద్దు చేయలేదని ఆమె సుప్రీంకోర్టును ప్రశ్నించారు. పలు కేసుల్లో  కేవలం తప్పు చేసిన వారినే శిక్షించారని కానీ బెంగాల్ విషయంలో మాత్రం పాతిక వేల మందిని తొలగించడానికి ఏ మాత్రం ఆలోచించలేదని విమర్శలు గుప్పించారు. బెంగాల్ విద్యా వ్యవస్థను కుప్పకూల్చడానికి చేస్తున్న కుట్రగా ఆమె అభివర్ణిస్తున్నారు. ఈ పాతిక వేల మందిలో తప్పు ఎవరు చేశారో చెప్పాలని.. ఆమె సుప్రీంకోర్టును డిమాండ్ చేస్తున్నారు.  

అర్హులైన ఉపాధ్యాయుల ఉద్యోగాలను రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దేకనికైనా పోరాడతానని మమతా బెనర్జీ ప్రకటించారు.  ఎవరు అర్హులో, ఎవరు అర్హులో స్పష్టం చేయాలిని..  జాబితా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.  మధ్యప్రదేశ్‌లో వ్యాపం కేసులో చాలా మంది మరణించారు. వారికి నేటి వరకు న్యాయం జరగలేదని గుర్తు చేశారు.  నీట్‌లో అనేక ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు పరీక్షను రద్దు చేయలేదు. బెంగాల్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. 

కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన తొలగింపుకు గురైన ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు.  సుప్రీం కోర్టు మాకు స్పష్టత ఇస్తే, మేము కృతజ్ఞులమై ఉంటాము. లేకపోతే, మేము ఒక మార్గాన్ని కనుగొని మీకు అండగా నిలుస్తామమని హమీ ఇచ్చారు. రెండు నెలలు  ఓపిక పడితే మీరు 20 సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం  ఉండదనని..ఈ రెడు నెలలకు కూడా జీతం ఇస్తామని ఆమె భరోసా ఇచ్చారు.                         నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న కారణంగా 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నియమించిన 25,000 మందికి పైగా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు గత వారం రద్దు చేసింది. ఎంపిక ప్రక్రియను సంస్కరరించలేనంతగా కలుషితం చేశారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.  భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా , న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వులో నాలుగు అతిక్రమణల్ని ప్రస్తావించారు.   OMR షీట్‌లను నాశనం చేశారని  WBSSC లోపాలు ,  అక్రమాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నించిందని ధర్మాసనం వ్యాఖ్యానిచింది.  తనను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపాధ్యాయుల నుండి ఉద్యోగాలను లాక్కోవద్దని మమతా బెనర్జీ అన్నారు. గాయపడిన పులి మరింత ప్రమాదకరమైనది. ఇది మన ప్రభుత్వంపై దాడేన్నారు.  

సుప్రీంకోర్టు ధిక్కరణకు సిద్ధపడినట్లుగా మమతా బెనర్జీ తీరు ఉండటం సంచలనంగా మారింది.