సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.









  • 21 ఏళ్ల వయసులోనే నవలలు రాయడం ప్రారంభించారు గుర్నా.

  • ఇప్పటివరకు 10 నవలలు, చాలా చిన్న కథలు రాశారు.

  • 1994లో ఆయన రాసిన పారడైస్‌ అనే నవల బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయ్యింది. 


భారత దేశానికి చెందిన విశ్వకవి రవీంద్రనాథ్​ ఠాగూర్​కు 1913లో నోబెల్​ బహుమతి దక్కింది. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి.. ఈ పురస్కారం వరించింది. 


ఈ ఏడాది విజేతలు..


వైద్య శాస్త్రంలో అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లకు సంయుక్తంగా నోబెల్ ఈ పురస్కారం దక్కింది.


భౌతిక శాస్త్రంలో సుకురో మనాబే, క్లాస్ ​హాసిల్​మేన్​, జార్జియో పారిసీలు నోబెల్ బహుమతి దక్కించుకున్నారు.


రసాయన శాస్త్రంలో బెంజమిన్​ లిస్ట్​, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్​మిలన్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది.​


ఇంకా ప్రకటించాల్సినవి..


అక్టోబర్​ 8న శాంతి బహుమతి, అక్టోబర్​ 11న ఆర్థిక శాస్త్రంలో నోబెల్​ బహుమతులను ప్రకటించనుంది రాయల్​ స్వీడిష్​ అకాడమీ.


Also Read: PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి