No survivors expected in Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ప్రమాద సమయంలో విమానంలో  242 మంది ఉన్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఇందులో  230 ప్రయాణీకులు ఉన్నారు.  228 పెద్దలు , ఇద్దరు చిన్న పిల్లలు.  12 మంది విమాన క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఇద్దరు పైలట్లు,  10 క్యాబిన్ క్రూ  ఉన్నారు.

ఈ ప్రయాణికుల్లో  169 భారతీయులు  ఉన్నారు.  53 బ్రిటిష్ జాతీయులు,  7 పోర్చుగీస్ జాతీయులు,  1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లుగా గుర్తించారు.  

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ప్రయాణికుల్లో ఉన్నారు.  2016 నుంచి 2021 వరకు రూపాని గుజరాత్ సీఎంగా వ్యవహరించారు.  ప్యాసింజర్ నంబర్ 12గా రూపానిపేరు ఉంది.  బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నారు. అంటే ప్రయాణించేందుకు ఆయన ఫ్లైట్ ఎక్కారు.  ప్యాసింజర్ జాబితాలో 215 ఎకానమీ క్లాస్ , 15 బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు ఉన్నారని, వీరిలో పలువురు భారతీయ, బ్రిటిష్, మరియు పోర్చుగీస్ పౌరులతో పాటు కొందరు పిల్లలు , వృద్ధులు  ఉన్నారు.  

విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 13:38 IST (08:08 UTC)కు టేకాఫ్ చేసింది .  కొన్ని సెకన్లలోనే మేఘనీ నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, విమానం 625 అడుగుల ఎత్తు (190 మీటర్లు) వద్ద సిగ్నల్ కోల్పోయింది, ఇది టేకాఫ్ తర్వాత కేవలం సెకన్లలో జరిగింది.  

 విజయ్ రూపాని ని ఆస్పత్రికి తీసుకెళ్లడం.. లేదా మృతదేహాన్ని గుర్తించడం వంటి వాటిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.