Rs. 2000 Note Exchange: 


ప్రూఫ్‌లు అవసరం లేదు..


ఇటీవలే RBI రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఇకపై మార్కెట్‌లో ఈ నోట్లు చెలామణిలో ఉండవు. అయితే...ఇప్పటికే ఆ నోట్లు ఉన్న వాళ్లు మే 23 వ తేదీ నుంచి దగ్గర్లోని బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు (Rs 2000 Notes Exchange) అని వెల్లడించింది. రూ.20 వేల వరకూ ఎక్స్‌ఛేంజ్‌కి అవకాశమిచ్చింది. అయితే..దీనిపై చాలా మందికి అనుమానాలున్నాయి. ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలంటే కచ్చితంగా ఐడీ ప్రూఫ్‌లు ఇవ్వాల్సిందేనా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పందించింది. రూ.20 వేల వరకూ మార్చుకునే అవకాశముందని తేల్చి చెప్పిన SBI..ఇందుకోసం ఎలాంటి ఫామ్స్‌ నింపాల్సిన పని లేదని వెల్లడించింది. అంతే కాదు. ఎలాంటి ఐడీ ప్రూఫ్స్‌ సబ్మిట్ చేయకుండానే నోట్లు మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. రూ.20 వేల కన్నా ఎక్కువ ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా రిక్విజిషన్ ఫామ్ (requisition form) నింపాలని వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని SBI బ్రాంచ్‌లు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా నోట్లు మార్చుకునేలా సహకరించాలని కోరింది. బ్రాంచ్‌ సిబ్బంది కూడా వినియోగదారులకు సహకరించాలని సూచించింది. 






సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2000 రూపాయల నోట్లు చెలామణిలో ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఒకవిధంగా దీనిని పాక్షిక రద్దుగా పరిగణించాలి. ఈ వార్త తర్వాత, 8 నవంబర్ 2016న మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు. 2016 నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాతి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు పనికిరావని, వాటికి విలువ ఉండదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. కొత్త 500, 2000 నోట్లను తీసుకొస్తామని కూడా మోదీ ప్రభుత్వం ప్రకటించింది. 2016 తర్వాత, ఇప్పుడు, మే 19, 2023న RBI మరోసారి అదే తరహా ప్రకటన చేసింది. రూ. 2000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ నోటు ఇప్పటికిప్పుడు రద్దు చేయలేదు కాబట్టి, దీనిని మినీ డీమోనిటైజేషన్‌గా ఆర్థికవేత్తలు పిలుస్తున్నారు. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను ఆ గడువులోగా ఏ బ్యాంక్‌కు వెళ్లి అయినా మార్చుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 


Also Read: Congress: కర్ణాటక కథ ముగిసింది, తరవాతి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కాంగ్రెస్ - ఆ 4 రాష్ట్రాలపైనే ఫోకస్