Nimisha Priya: యెమెన్‌లో తన వ్యాపార భాగస్వామిని చంపారనే ఆరోపణలతో నిమిష ప్రియ అనే భారతీయ నర్సుకు మరణశిక్ష విధించారు. ఆమె మరణశిక్షను రంజాన్ తరవాత అమలు చేస్తారని ఈ మేరకు  ఆదేశాలు జారీ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే యెమన్ లోని భారతీయ ఎంబసీ మాత్రం అలాంటి ఆదేశాలు జారీ అయినట్లుగా తమకు సమాచారం ప్రకటించింది. కోచిలో నివాసం ఉంటున్న నిమిష ప్రియ కుటుంబానికి జైలు నుంచి  ఫోన్ వచ్చింది. రంజాన్  ముగిసిన వెంటనే మరణశిక్ష అమలు చేస్తామని సమాచారం ఇచ్చారు. అదే విషాయన్ని వారు మీడియాతో పంచుకున్నారు. కానీ భారతీయ ఎంబసీ మాత్రం అలాంటిదేమీ లేదని అంటోంది.                       

కేరళలోని కొచ్చికి చెందిన నిమిష ప్రియ కుటుంబం పేదరికంలో మగ్గేది. ఉపాధి కోసం  నిమిష ప్రియ 19 ఏళ్ల వయసులో  2008లో యెమెన్‌కు వెళ్లారు. తర్వాత స్వదేశం తిరిగి వచ్చి ఓ ఆటోడ్రైవర్ ను పెళ్లారు. తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి యెమెన్ వెళ్లారు.ఓ పాప పుట్టిన తర్వాత ఖర్చు లు భరించలేక నిమిష ప్రియ అక్కడే ఉండిపోగా భర్త, పాప కేరళకు వచ్చేశారు. నిమిష  ప్రియ అక్కడే ఓ భాగస్వామి సాయంతో వ్యాపారం ప్రారంభించారు. నర్సు కావడంతో దానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత ఏం జరిగిందో కానీ వ్యాపారభాగస్వామికి  హానికరమైన మోతాదులో మత్తు మందు ఇచ్చి నిమిష ప్రియ చంపేసిందన్న ఆరోపణలు వచ్చాయి.  తన మృతదేహాన్ని ఛిద్రం చేశారని  ఆరోపణలతో  2017లో నిమిష ప్రియ అరెస్టయ్యారు.  

యెమెన్ చట్టం ప్రకారం, ఎవరిదైనా ప్రాణం పోతే, దోషికి మరణ శిక్ష విధిస్తారు. ప్రాణానికి ప్రాణం అన్నమాట. అయితే షరియా చట్టాన్ని అనుసరించే దేశాల్లో ఒకవేళ బాధిత కుటుంబం నుంచి దోషులు క్షమాభిక్ష పొంది, ఆ కుటుంబానికి  పరిహారం  చెల్లిస్తే, ఆయా ప్రభుత్వాలు మరణ శిక్షను రద్దు చేయచ్చు. యెమెన్ షరియా చట్టాన్ని అనుసరించే దేశం.అందుకే బాధిత  కుటుంబానికి పరిహారం చెల్లించి బయటపడేందుకు  ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు పెద్దగా కనిపించడం  లేదు.