New toll system in India: ఏప్రిల్ 1 నుంచి మారనున్న టోల్ ఫీ విధానం! నితిన్ గడ్కరీ ఏమన్నారంటే...

New toll system in India: భారత ప్రభుత్వం కొత్త టోల్ విధానం త్వరలోనే అమలు చేయనుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Continues below advertisement

New toll system in India: దేశంని టోల్ వ్యవస్థలో మార్పులు రాబుతున్నాయని రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కేంద్రమంత్రి ఏ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ... జాతీయ రహదారులకు కొత్త టోలింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని, దీనివల్ల వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేవారికి కొంత ఉపశమనం లభిస్తుందని తెలిపారు. టోల్ పన్ను విషయంలో కొత్త విధానం సిద్ధంగా ఉందని, 2025 ఏప్రిల్‌లో ముందే దేశంలో అమలు చేస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.

Continues below advertisement

కొత్త టోల్ విధానం తీసుకురానున్న నితిన్ గడ్కరీ  
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టోల్ విధానం గురించి మాట్లాడుతూ, ఈ కొత్త విధానం రావడం వల్ల ఇకపై జాతీయ రహదారులపై టోల్ రేట్ల గురించి ప్రజల్లో చర్చే ఉండదన్నారు. నితిన్ గడ్కరీ ఇటీవల లోక్‌సభలో చేసిన తన ప్రసంగంలో... ప్రభుత్వం జాతీయ రహదారులపై జరిగే టోల్ వసూలును వార్షిక పాస్ సిస్టమ్‌కు మారుస్తామన్నారు. దీనివల్ల ప్రజలు టోల్ క్రాస్ చేయడంలో ఇబ్బంది పడబోరని తెలిపారు. ఫలితంగా సమయం డబ్బు రెండూ ఆదా అవుతాయని వెల్లడించారు.  

భవిష్యత్ ప్రణాళిక కూడా సిద్ధం
నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ప్రస్తుతం NHAI టోల్ ఆదాయం 55 వేల కోట్లు వస్తుందని వివరించారు. తదుపరి రెండు సంవత్సరాలలో ఇది 1.40 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని వెల్లడించారు. తన వద్ద ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఒక ప్రాజెక్ట్ ఉందని దీనికి బడ్జెట్ నుండి 2.80 లక్షల కోట్ల రూపాయలు లభిస్తాయన్నారు. భూ సేకరణ, పర్యావరణ అనుమతులలో ఆలస్యం జరుగే అవకాశం ఉన్నందున వ్యయం పెరిగా ఛాన్స్  ఉందన్నారు.  

కొత్త టోల్ పాస్ వ్యవస్థ ఏమిటి?
భారత ప్రభుత్వం వన్-టైమ్ చెల్లింపు ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు వార్షిక పాస్ ఇవ్వనుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇలా వాహనాల వినియోగదారులు ఒకేసారి మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఒక పాస్ లభిస్తుంది. దీని ద్వారా వాహనం ఏడాది పాటు ఏదైనా జాతీయ రహదారి, ఎక్స్‌ప్రెస్‌వేల గుండా వెళ్ళవచ్చు, స్పాట్‌లో టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. సమయం, డబ్బులు కూడా ఆదా అవుతాయని అంటున్నారు. 
భారత ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం వల్ల వ్యక్తిగత వాహనాల్లో సంవత్సరంలో అనేక సార్లు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించేవారికి ప్రయోజనం ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల టోల్ తగ్గడమే కాదు టోల్ ప్లాజాల్లో రాకపోకలు సులభతరం అవుతాయి. ట్రాఫిక్ లేని ప్రయాణంతో సమయం ఆదా అవుతుంది.  

Continues below advertisement
Sponsored Links by Taboola