MadyaPradesh No one comes forward to claim the 40 kg gold in the car on the road: రోడ్డు మీద వెళ్తూంటే ఐదు వందల రూపాయల నోటు దొరికితే.. మాదంటే మాదని క్లెయిన్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు. కానీ నలభై కేజీల బంగారం, పది కోట్ల డబ్బు ఉందంటే వస్తారా? . రానే రారు. ఎందుకంటే భయపడతారు. అదేదో పెద్ద స్కామ్ అయి ఉంటుందని ఆ డబ్బును తీసుకుంటే నేరుగా జైలుకు పంపేస్తారని అనుకుంటారు. ఖచ్చితంగా ఇలాగే జరిగింది మధ్యప్రదేశ్‌లో. 

మధ్యప్రదేశ్‌లోని మెండోరి అనే అటవీ ప్రాంతంలో ఓ కారును రోడ్డు పక్కన ఆపేసి వెళ్లిపోయారు కొంత మంది వ్యక్తులు. నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో ఉన్న కారును చూసికొంత మంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారును స్వాధీనం చేసుకున్నారు. కారు ఓనర్లు ఆ చుట్టుపక్క ఎవరైనా ఉన్నారేమో పరిశీలించారు కానీ గంటలు గడిచినా ఎవరూ రాలేదు. దాంతో పోలీసులు కారును స్టేషన్ కు తరలించారు. దానిలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయో లేదో పరిశీలించారు. అక్కడ దొరికిన వాటిని చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నలబై కేజీల బంగారం బిస్కెట్ల రూపంలో ఉంది. పది కోట్ల నగదు కూడా ఉంది. 

తమ కారు పోయిందని కానీ.. తమ డబ్బులు, బంగారం పోయాయని కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏదేదో తేడా వ్యవహారం అని పోలీసులకు అర్థం అయింది. ఈ డబ్బులు ఎవరివో వారికి హింట్ కూడా వచ్చింది. అదే సమయంలో భోపాల్లోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు బిల్డర్లను టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తూండటంతో ఎవరో ఒక బిల్డర్ ఇలా తన అక్రమ సంపాదన అంతా.. కారులో పెట్టి భయంతో తీసుకు వచ్చి రోడ్డు పక్కన వదిలేసిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా  అసలు ఆ బంగారం, డబ్బు ఎవరివో గుర్తిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.     

మమూలుగా అయితే ఈ సొమ్ము సోదాల్లో దొరికితే సీజ్ చేస్తారు.కేసులు పెడతారు. అంతకు మూడింతలు కేసులు పెడతారు. అంత కన్నా ఈ సొమ్మును రోడ్డున పక్కన పడేస్తే..ఎవరూ చూడకపోతే రోడ్డు పక్కన ఉన్న దాన్నిసోదాలు ముగిసిన తర్వాత తెచ్చుకోవచ్చని అనుకుననారు.లేకపోతే పోతే పోయిందని అనుకుంటారు. అందుకే తన సొమ్ము పోలీసులకు దొరికినా అ అక్రమార్కుడు మాత్రం పంటి కింద బాధ బిగువు పట్టి సైలెంట్ గా ఉన్నాడు.