Delhi Excise Policy Scam: అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. ఇదే సమయంలో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు సీబీఐ అరెస్ట్‌ని ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు. లిక్కర్ స్కామ్‌లో అవినీతి జరిగిందన్న సీబీఐ ఆరోపణల్ని వ్యతిరేకించారు. అయితే..ఈ పిటిషన్‌ల ఆధారంగా సుప్రీంకోర్టు CBIకి నోటీసులిచ్చింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. "ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వలేం. నోటీసులు మాత్రమే ఇవ్వగలం" అని స్పష్టం చేసింది. 






సిసోడియాకి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..


లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకి ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆ తరవాత రెండు రోజులకే అరవింద్ కేజ్రీవాల్‌ ఈ పిటిషన్ వేశారు. సీబీఐ, ఈడీ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కావాలని కోరారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ఇదే వ్యవహారంపై విచారణ జరిపింది. సీబీఐ అరెస్ట్‌ని అక్రమమని కేజ్రీవాల్ వాదించినప్పటికీ కోర్టు ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదు. ఈ అరెస్ట్ అనైతికం కాదని తేల్చి చెప్పింది. పక్కా సాక్ష్యాధారాలున్నప్పుడు అక్రమం అని ఎలా అంటామని ప్రశ్నించింది. ఆగస్టు 5వ తేదీన ఈ తీర్పునిచ్చింది. ఆ తరవాతే కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. (Also Read: Kolkata News: కోల్‌కత్తా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం! పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయం)


ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకి కీలక విషయాలు వెల్లడించారు. తనను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే...ఈ ఆరోపణల్ని సీబీఐ, ఈడీ కొట్టిపారేశాయి. ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్‌ కేసుని విచారించి కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. ఆ తరవాత సీబీఐ కూడా రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌ అవినీకితి పాల్పడ్డారనడానికి తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయని తేల్చి చెప్పింది. అంతకు ముందు ఈడీ కూడా ఇదే వాదన వినిపించింది. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని స్పష్టం చేసింది. 


Also Read: Viral News: క్లాస్‌రూమ్‌లో బాలికపై అత్యాచారయత్నం చేసి టీచర్, కేకలు వేయడంతో పరారీ