Gukesh Prize Money Tax: ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ ను గుకేష్ దొమ్మరాజు గెలుచుకున్నారు. 18 ఏళ్ల 08 నెలల 14 రోజుల వయసులో గుకేశ్ ఈ విజయం అందుకున్నాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచినందుకు గుకేశ్‌కు రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. కానీ ఇందులో కేంద్రానికి కట్టాల్సి నట్యాక్స్ చాలా ఎక్కువగా ఉండనుంది.
గుకేశ్‌కు రూ. 11.34 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు రూ. 5.04 కోట్లు నగదు బహుమతి దక్కింది. దాంతోనే గుకేశ్ రూ. 4.67 కోట్ల పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్ సిద్దం చేసుకుని వైరల్ చేస్తున్నారు.
రూ. 11కోట్లు కావున గుకేశ్ 30శాతం ట్యాక్స్ స్లాబ్ కిందకు వస్తాడు. ఆదాయపు పన్ను శాఖ కాలిక్యులేటర్ ప్రకారం, ఆ పన్ను మొత్తం సుమారు రూ. 3కోట్ల 28లక్షలు. దీనికి సర్ఛార్జ్.. రూ. కోటి 30 లక్షలు. ఈ మొత్తానికి సెస్ కలుపుకుంటే దాదాపు రూ. 4.67 కోట్ల వరకు ఆర్థిక శాఖకు వెళ్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
అయితే సాధారణంగా పన్ను దేశంలో సంపాదించుకుంటేనే పడుతుంది. విదేశాల్లో సంపాదించుకుని వచ్చే వాటిపై పన్ను పడుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేసేస్తున్నారు.
డబ్బుల కోసం నేను చెస్ ఆడటం లేదు. కానీ ఈ డబ్బు మాకు చాలా ఎక్కువ. నేను చెస్‌లోకి వచ్చినప్పుడు మా కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడిందిని గుకేష్ చెుతున్నారు. ఈ ప్రైజ్‌మనీతో మేం సౌకర్యవంతంగా ఉంటామని గుకేష్ చెబుతున్నారు.