Nirav Modi Extradition:


పిటిషన్‌ కొట్టివేత..


భారత్‌కు తిరిగి రాకుండా నీరవ్ మోదీ లండన్ హైకోర్ట్‌లో వేసిన పిటిషన్‌ను ఆ న్యాయస్థానం కొట్టి వేసింది. భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11 వేల కోట్ల మనీలాండరింగ్‌ పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నీరవ్ మోదీ. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు లండన్‌కు పారిపోయాడు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య "నీరవ్ మోదీ అప్పగింత"పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చట్టంలోని ఏదో ఓ లొసుగుని అడ్డం పెట్టుకుని కాలం గడిపేస్తూ వచ్చాడు నీరవ్ మోదీ. అయితే..భారత్‌కు అప్పగించేందుకు లండన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనిని సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ వేశాడు. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. ఫలితందా..భారత్‌కు అప్పగించడంలో ఓ అడుగు ముందుకు పడింది. అయితే...లండన్ నుంచి భారత్‌కు రప్పించే ప్రక్రియ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇందుకు ఇంకా చాలా తతంగం ఉంది. భారత్‌కు అప్పగించాక నీరవ్ మోదీని ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైల్‌కు తరలించనున్నారు. నీరవ్ మోదీతో పాటు మెహుల్ చోక్సీ కూడా ఈ స్కామ్‌లో పాలు పంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.






లండన్ హైకోర్ట్‌ నీరవ్ మోదీ పిటిషన్‌ను తోసిపుచ్చినప్పటికీ...సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశముంటుంది. ఇందుకు 14 రోజుల గడువు 
మాత్రమే ఉంటుంది. అయితే...ఇందుకు హైకోర్టు అనుమతి తప్పనిసరి. సుప్రీంకోర్టులో విచారించ తగ్గ కేసు అని హైకోర్టు భావిస్తేనే...నీరవ్ మోదీకి ఆ అవకాశముంటుంది. ఇది కుదరకపోతే..యూరోపియన్ కోర్ట్‌ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను అప్రోచ్ అయ్యే వీలుంటుంది. 


సీబీఐ మోస్ట్ వాంటెడ్..


ప్రస్తుతానికి నీరవ్ మోదీ లీగల్ టీమ్ తరవాత ఏం చేయబోతున్నారన్న విషయంలో స్పష్టతనివ్వడం లేదు. 2019 మార్చిలో లండన్‌ పోలీసులు నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. ఈ కేసులో తుది తీర్పు వచ్చేంత వరకూ జైల్లోనే ఉండనున్నాడు. నీరవ్ మోదీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని సీబీఐ, ఈడీ ఎదురు చూస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లూప్‌హోల్స్‌ని పట్టుకుని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన మోదీకి కఠిన శిక్ష వేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. ఈ ముగ్గురు భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన వ్యక్తులు. బ్యాంకులకు వేల కోట్లు పంగనామాలు పెట్టిన వీళ్ల దగ్గర నుంచి ప్రభుత్వం ఎంత వసూలు చేసిందో తెలుసా? ఈ ముగ్గురికి చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. 


Also Read: Viral Video: తల్లడిల్లిన తల్లి హృదయం- పిల్లల్ని కాపాడిన ఎలుక, హార్ట్ టచింగ్ వీడియో!