No Toll Fee For Two Wheelars: జాతీయ రహదారులపై టూ వీలర్లకు కూడా ఇక టోల్ చార్జీలు వసూలు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి NHAI, అలాగే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ .. చెక్ పెట్టాయి. అలాంటి ప్రతిపాదనలేమీ లేవని స్పష్టం చేశాయి .
2025 జూలై 15 నుండి టూ వీలర్లపై టోల్ ఛార్జీలు విధిస్తారని.. కొన్ని మీడియా నివేదికలు , సోషల్ మీడియా పోస్ట్‌లు ప్రచారం చేశాయి. లు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేయడం ప్రారంభమవుతుందని, ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రచారం చేశారు. రహదారి నిర్వహణ కోసం అదనపు ఆదాయం సమీకరించడం, టోల్ వసూలు వ్యవస్థను ఏకీకృతం చేయడం గురించి కేందర్ం చర్చలు జరుపుతూడంటంతో ఈ పుకారు బయటకు వచ్చింది.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ వార్తలను ఖండించారు. "కొన్ని మీడియా హౌస్‌లు టూ వీలర్ వాహనాలపై టోల్ టాక్స్ విధించే ప్రతిపాదన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ఏదీ ప్రతిపాదించలేదు. టూ వీలర్ వాహనాలకు టోల్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుంది," అని ఆయన X లో పేర్కొన్నారు. ఆయన ఈ వార్తలను "సంచలనం సృష్టించేందుకు" వాస్తవాలను ధృవీకరించకుండా ప్రచారం చేయడం ఆరోగ్యకరమైన జర్నలిజం కాదని విమర్శించారు.
టోల్ నియమాలలో ఏదైనా మార్పు జరిగితే, అది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ద్వారా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్బతారు. ఇటువంటి ఎలాంటి నోటిఫికేషన్ లేదా పబ్లిక్ కన్సల్టేషన్ డాక్యుమెంట్ జారీ కాలేదు. నేషనల్ హైవేస్ ఫీ (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్) రూల్స్, 2008 ప్రకారం, టూ వీలర్లు టోల్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంది.