Newly Married Woman:
బిహార్‌లో ఘటన..
బిహార్‌లోని హాజీపూర్‌లో కొత్తగా పెళ్లైన జంటను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ విడదీశాయి. సోషల్ మీడియా విషయంలో వచ్చిన గొడవతో మహిళ..తన భర్తను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితమే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే ఇలా విడిపోవాల్సి వచ్చింది. అంతే కాదు. ఆ మహిళ తన అన్నను రెచ్చగొట్టి భర్త మీదకు పంపింది. ఆ వ్యక్తి గన్ పట్టుకుని వచ్చి మరీ బావను బెదిరించాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాక కానీ అసలు విషయం బయటపడలేదు. కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా గంటల కొద్ది ఫోన్ పట్టుకుని కూర్చుంటోందని అత్తమామలు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కి అడిక్ట్ అయిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భార్య, భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ మహిళ అంతటితో ఆగకుండా ఇంట్లో వాళ్లకు చెప్పడం, వాళ్లు వచ్చి దాడి చేయడం వల్ల వివాదం కాస్త ముదిరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి ఆ గొడవకు చెక్ పెట్టారు. కొత్త పెళ్లి కూతురు సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే...అటు అమ్మాయి తరపున బంధువులు మాత్రం తమ వాదన వినిపిస్తున్నారు. అత్తమామలు అమ్మాయి ఫోన్ లాక్కున్నారని, కనీసం తమతో మాట్లాడటానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. చివరకు పోలీసుల జోక్యంతో కొంత వరకూ వివాదం సద్దుమణిగింది. ఆ అమ్మాయి మాత్రం అత్తమామలతో కలిసి ఉండేందుకు అంగీకరించలేదు. అంతే కాదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడకుండా ఉండలేనని తేల్చి చెప్పింది. రాజీ కుదరక...ఆ అమ్మాయి తల్లిగారింటికి వెళ్లిపోయింది.
కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు..
తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉందామంటూ భర్తను భార్య మానసికంగా వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. వేధింపులకు గురి చేయడమే కాకుండా సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుండి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. అలాంటి భార్య నుండి విడాకులు కోరవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. పశ్చిమ మిడ్నాపూర్ కు చెందిన ప్రశాంత్ కుమార్ మండల్ కు 2001లో ఝార్నాతో వివాహం జరిగింది. ప్రశాంత్ ఓ పాఠశాలలో పార్ట్ టైం టీచర్ గా పని చేస్తున్నాడు. దాంతో పాటు బయట ట్యూషన్లు చెబుతుండే వాడు. తనకు వచ్చిన సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అయితే అరకొర సంపాదనతో తల్లిదండ్రులతో ఉన్న ఆ కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం సరిపోయేది కాదు. దీంతో భార్య వేరు కాపురం ఉందామంటూ ప్రశాంత్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టింది. ఈ విషయంపై గొడవలూ జరుగుతుండేవి. ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఝార్నా అతనిపైనా, అత్తమామలపైనా వేధింపుల కేసు పెట్టింది.
ఆ కేసు వల్ల ప్రశాంత ప్రభుత్వ ఉద్యోగం పొందలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ తనకు విడాకులు ఇప్పించాలంటూ మిడ్నాపూర్ లోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన కోర్టు ప్రశాంత్ కు, ఝార్నాకు 2009లో విడాకులు మంజూరు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఝార్నా కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ప్రశాంత్ కు అనుకూలంగా ఆమె పిటిషన్ ను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read: తమ్ముడిని గొంతు కోసి చంపిన 15 ఏళ్ల బాలిక, ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో హత్య