New Driving Rules in India: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ  శాఖ డ్రైవింగ్ లైసెన్స్‌కి (New Driving Rules) సంబంధించి కొత్త రూల్స్‌ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. కేవలం RTO ఆఫీస్‌లలోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్‌ నుంచి కూడా లైసెన్స్‌లు పొందేలా కొత్త నిబంధన చేర్చారు. ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ స్వయంగా డ్రైవింగ్ టెస్ట్‌లు పెట్టి పాస్ అయిన వాళ్లకి లైసెన్స్‌లు (New Licence Rules) ఇస్తాయి. ఆ మేరకు ఈ స్కూల్స్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుంది. దీంతో పాటు పాత వాహనాలపైనా కఠినంగా వ్యవహరించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలం చెల్లిన 9  లక్షల ప్రభుత్వ వాహనాలను ఇక పూర్తిగా పక్కన పెట్టేలా ఓ రూల్‌ అమల్లోకి తీసుకురానుంది. తద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఓవర్ స్పీడ్‌కి రూ.1000-2 వేల వరకూ జరిమానా విధించనున్నారు. ఒకవేళ మైనర్‌ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే రూ.25 వేల జరిమానా వసూలు చేయనున్నారు. అంతే కాదు. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్‌నీ రద్దుచేస్తారు. ఆ మైనర్‌కి పాతికేళ్లు వచ్చేంత వరకూ డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. లైసెన్స్‌లు పొందే విషయంలో గతంలో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ని పూర్తిగా తగ్గించనుంది ప్రభుత్వం. పేపర్‌ వర్క్ ఎక్కువగా లేకుండానే లైసెన్స్ తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకురానుంది. టూవీలర్‌, ఫోర్ వీలర్ ఇలా ఏ వెహికిల్ కోసం లైసెన్స్ అప్లై చేస్తున్నామన్న దాన్ని బట్టి కొంత వరకూ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి రెండు చెకప్‌ల కోసం మాత్రం RTO ఆఫీస్‌కి వెళ్లాల్సి వస్తుంది. 


కొత్త రూల్స్ ఇవే..


1. జూన్ 1వ తేదీ నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్‌ నుంచే లైసెన్స్‌లు తీసుకోవచ్చు. ఈ స్కూల్స్‌లోనే డ్రైవింగ్ టెస్ట్‌లు నిర్వహించి లైసెన్స్‌లు ఇచ్చేలా పర్మిషన్‌ ఉంటుంది. 


2. అన్ని ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్‌కీ ఈ రూల్ వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన ఎలిజిబిలిటీ ఆధారంగా చూస్తే ఆ స్కూల్‌కి కచ్చితంగా ఓ ఎకరం స్థలం ఉండాలి. ఫోర్ వీలర్స్‌ ట్రైనింగ్‌ కూడా ఇస్తే అందుకు తగ్గట్టుగా 2 ఎకరాల స్థలం కచ్చితంగా ఉండాలి. 


3. ఈ స్కూల్స్‌లో టెస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ట్రైనర్స్‌కి కచ్చితంగా ఐదేళ్ల అనుభవంతో పాటు హైస్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుండాలి. బయోమెట్రిక్స్‌తో పాటు ప్రస్తుత టెక్నాలజీపై అవగాహన ఉండాలి. 


4. Light Motor Vehicles అయితే నాలుగు వారాల్లో 29 గంటల పాటు డ్రైవింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో 21 గంటల పాటు వెహికిల్‌ నడిపే విధంగా మరో 8 గంటల పాటు థియరీ క్లాసులు చెప్పే విధంగా ప్లాన్ చేసుకోవాలి. 


5. ఇక Heavy Motor Vehicles అయితే 31 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. 8 గంటల పాటు థియరీ క్లాస్‌లు చెప్పాలి. మొత్తం 6 వారాల్లో ఈ ట్రైనింగ్ పూర్తవ్వాలి. 


6. ఈ అర్హతలున్న డ్రైవింగ్ స్కూల్ ఓనర్స్ https://parivahan.gov.in/ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 


Also Read: Pune Porsche Accident: పోర్షే కార్ యాక్సిడెంట్ కేసు, ఎస్కేప్ అయ్యేందుకు నిందితుడి తండ్రి హైడ్రామా - చివరకు అరెస్ట్