Whatsapp Down Memes : వాట్సాప్ లేకపోతే ఎలా ఉంటుందో తెలిసొచ్చిందా ? . ... మీకు..మాకే కాద ప్రపంచ్యాప్తంగా అందరిదీ అదే పరిస్థితి. అసలేం జరిగిందో కానీ వాట్సాప్ ఆగిపోవడం అంటే రోజువారీ కార్యకలాపాలన్నీ ఆగిపోయినట్లే అయింది. అందుకే సోషల్ మీడియా యూజర్లు ఒక్క సారిగా ట్రోలింగ్ ప్రారంభించారు. వాట్సాప్ పని చేయకపోవడంతో మొదటగా అందరూ తమ నెట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఉంటారు. వైఫై ఎందుకు పోయిందో అని ప్రోవైడర్‌ను నిందించుకుని ఉంటారు. దాన్ని గుర్తు చేస్తూ పెట్టిన మీమ్ అందర్నీ నవ్విస్తోంది.
వాట్సాప్ పని చేయకపోతే ప్రజలంతా ఏం చేస్తారో తెలిపేలా పెట్టిన మీమ్ నవ్వు తెప్పిస్తుంది కానీ.. అందులో నిజం ఉందని మనకూ అర్థమవుతుంది.
వాట్సాప్ నా ఒక్కడిదే పని చేయడం లేదా అనే టెన్షన్ కూడా అందరికీ ఉంటుంది. అందరిదీ అని తెలిసిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే ఈ మీమ్
వాట్సాప్ ఇంజినీర్లు రైట్ నౌ అంటూ పెట్టిన కొన్ని పోస్టులు చూస్తే నవ్వకుండా ఉండలేం.
వాట్సాప్ పని చేయడం లేదని తెలుసుకోవాలంటే అందరూ ట్విట్టర్‌లో చూడాల్సిందేనని ఎక్కువ మీమ్స్ పెట్టారు.