Piramal Pharma: పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ (Piramal Enterprises Limited) నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా లిస్ట్‌ అయిన  పిరామల్‌ ఫార్మా, IPO ద్వారా తనకు అందిన డబ్బును ఖర్చు చేసే ప్లాన్‌లో ఇప్పుడు ఉంది. కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ & మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (CDMO), కాంప్లెక్స్ జెనరిక్స్ రంగాల్లో ఆర్గానిక్‌ & ఇన్‌-ఆర్గానిక్‌ గ్రోత్‌ ద్వారా కార్యకలాపాలు పెంచుతామని, మార్జిన్ వృద్ధిపై దృష్టి పెడతామని ఈ కంపెనీ ప్రకటించింది. 


సొంత కంపెనీలో చేపట్టే కార్యక్రమాల ద్వారా బిజినెస్‌ పెంచుకోవడాన్ని ఆర్గానిక్‌ గ్రోత్‌ అని, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా బిజినెస్‌ పెంచుకోవడాన్ని ఇన్‌-ఆర్గానిక్‌ గ్రోత్‌ అని పిలుస్తారు.


పిరామల్ ఫార్మా షేర్లు ఈ నెల 19న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. 


గ్లోబల్‌ ప్లాన్స్‌
UKలోని గ్రేంజ్‌మూత్‌ ఫెసిలిటీలో యాంటీబాడీ డ్రగ్స్‌ తయారీ కోసం కంపెనీ ₹1,200 కోట్ల మూలధన వ్యయం (Capital Expenditure) చేస్తుందని పిరమల్ ఫార్మా చైర్‌ పర్సన్ నందిని పిరామల్ ఇటీవల ఒక ముఖాముఖిలో చెప్పారు. వచ్చే 12-18 నెలల్లో ఈ వ్యయం చేయనున్నారు. దీంతోపాటు, మన దేశంలోని యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌ (API) తయారీ కేంద్రం సామర్థ్యాన్ని; USలోని లెక్సింగ్‌టన్‌లో ఉన్న ఇంజెక్టబుల్స్‌ ఫెలిసిటీ కెపాసిటీని; రివర్‌వ్యూలో ఉన్న API సెంటర్‌ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది. తద్వారా ఆపరేటింగ్‌ లీవరేజ్‌ సాధించాలన్నది కంపెనీ లక్ష్యంగా నందిని పిరామల్‌ చెప్పారు.


డాలర్‌-రూపాయి మార్పిడి రేటులో అస్థిరత, ద్రవ్యోల్బణం, అధిక ఇంధన ధరలు వంటి స్వల్పకాలిక సవాళ్లు ఉన్నప్పటికీ, CDMO సేవలకు డిమాండ్ బలంగా ఉందని పిరామల్‌ వెల్లడించారు. తన థర్డ్‌ వర్టికల్‌ అయిన కన్జ్యూమర్‌ హెల్త్‌ బిజినెస్‌ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఆర్గానిక్ విస్తరణ మీదే దృష్టి పెట్టినట్లు చెప్పారు.


IPO డబ్బుతో కొన్ని అప్పులను కూడా ఈ కంపెనీ తీర్చింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రుణాల్లో 225 మిలియన్‌ డాలర్లను చెల్లించింది. దీనివల్ల కంపెనీ ఫైనాన్షియల్‌ మెట్రిక్స్‌ మెరుగు పడతాయి.


వ్యాపారాలు - ఆదాయాలు
పిరామల్ ఫార్మా సొల్యూషన్స్ (PPS) పేరిట నడుస్తున్న కాంట్రాక్ట్‌ డెలవప్‌మెంట్‌ & మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీ కూడా పిరమల్ ఫార్మాలో ఒక భాగంగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయంలో దాదాపు 3/5 వంతు వాటా PPS నుంచే వస్తోంది. హాస్పిటల్ జనరిక్స్ వ్యాపారమైన పిరామల్ క్రిటికల్ కేర్ (PCC), పిరామల్ ఫార్మా మొత్తం ఆదాయంలో 30 వాటాను వాటాను కలిగి ఉంది. మన దేశంలో, ఓవర్-ది-కౌంటర్ ఫార్మాట్‌లో ఉత్పత్తులను అమ్మే కన్జ్యూమర్‌ హెల్త్‌ బిజినెస్‌ నుంచి మిగిలిన ఆదాయం అందుతోంది.


US ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ కార్లైల్ గ్రూప్‌నకు (Carlyle Group) పిరామల్ ఫార్మాలో 20 శాతం వాటా ఉంది. 2020 అక్టోబర్‌లో 360 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టినందుకు ఈ వాటాను కార్లైల్‌ గ్రూప్‌ సొంతం చేసుకుంది.


స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ బిగ్‌ గ్యాప్‌డౌన్‌లో రూ. 156.70 దగ్గర ఓపెన్‌ అయిన పిరామల్‌ ఫార్మా స్టాక్‌, కనిష్ట స్థాయి నుంచి బాగా పుంజుకుంది. ఉదయం 10.45 గంటల సమయానికి నష్టాలను పూర్తిగా తుడిచేసి, ఫ్లాట్‌గా రూ. 165.50 దగ్గర ట్రేడవుతోంది. గత సెషన్ ముగింపు ధర రూ. 164.90. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.