Nepal New President:


15 వేల ఓట్ల తేడాతో విజయం..


నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రాం చంద్ర పౌడెల్ నేపాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సుభాష్ చంద్రపై 15 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. నేపాల్ ఎన్నికల సంఘం కమిషనర్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మార్చి 12 న ప్రస్తుత అధ్యక్షురాలు 
బిద్యా దేవి భండారి పదవీ కాలం ముగియనుంది. అధ్యక్షుడిగా ఐదేళ్ల వరకూ కొనసాగే అవకాశముంటుంది. అయితే ఏ వ్యక్తైనా సరే రెండు సార్లు మాత్రమే ఈ పదవిలో ఉండాలన్న నిబంధన అక్కడ అమల్లో ఉంది. అధ్యక్ష ఎన్నికల ముందే పౌడెల్ కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు మాజీ స్పీకర్‌లు ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ పడటం వల్ల హీట్ పెరిగింది. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వం పౌడెల్‌కే మద్దతునిచ్చింది. గత నెల మాజీ ప్రధాని కేపీ శర్మ నేతృత్వంలోని CPN-UML పార్టీ ప్రధాని ప్రచండకు మద్దతుని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. పౌడెల్‌కు మద్దతునిస్తున్నారన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ వెల్లడించింది. నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే....కొన్నేళ్లుగా ఈ పదవిపైనా వివాదాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 2008లో గణతంత్ర దేశంగా మారిన నేపాల్‌లో మూడోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.