జీరో టాలరెన్స్ పాలసీ తప్పదు: అమిత్ షా 


కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో దాదాపు 30 వేల కిలోల డ్రగ్స్‌ను నాశనం చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-NCB.దాదాపు నాలుగు చోట్ల దొరికిన ఈ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.హోం మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా, NCB అధికారులు ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ సందర్భంగా ఎన్‌సీబీ ఓ లక్ష్యం పెట్టుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 75 వేల కిలోల డ్రగ్స్‌ను డిస్పోస్ చేయాలని నిర్దేశించుకుంది. అందులో భాగంగానే...30 వేల కిలోల డ్రగ్స్‌ను డిస్పోస్ చేశారు. ఛండీగఢ్‌లోని డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు అమిత్‌ షా. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "డ్రగ్ ట్రాఫికింగ్‌ విషయంలో జీరో టాలరెన్స్ తప్పదు" అని స్పష్టం చేశారు. "డ్రగ్ ట్రాఫికింగ్ సమాజానికి ప్రమాదకరం. సుసంపన్నమైన దేశాలేవీ దీన్ని సహించకూడదు. ఈ ట్రాఫికింగ్‌ను అరికట్టి మన దేశ యువతను కాపాడుకోవాలి" అని అన్నారు. డ్రగ్స్ విక్రయించటం ద్వారా వచ్చిన డబ్బులతో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, భారత్‌లో డ్రగ్స్ ట్రాఫికింగ్‌పై జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపైన, జాతీయ భద్రతపైనా డ్రగ్స్..ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు.













 


అప్పటి నుంచి డ్రగ్ డిస్పోసల్ కార్యక్రమం 


ఈ ఏడాది జూన్ 1 నుంచి డ్రగ్ డిస్పోసల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది NCB.జులై 29వ తేదీ వరకూ మొత్తం 11 రాష్ట్రాల్లో కలిపి 51,217 కిలోల డ్రగ్స్‌ను డిస్పోస్ చేశారు. ఇప్పుడు 30 వేల కిలోల డ్రగ్స్‌ను ఒకేసారి నిర్వీర్యం చేశారు. ఫలితంగా...NCB నిర్దేశించుకున్న 75, 000 కిలోల డిస్పోసల్‌ను అధిగమించి ఏకంగా అది 81,686 కిలోలకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. గతేడాది కూడా ఇదే స్థాయిలో డ్రగ్స్‌ను డిస్పోస్ చేసినట్టు అప్పట్లో లోక్‌సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. 2021లో 59,467 కిలోలు, 2020లో 51,850 కిలోలు, 2019లో 40,242 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. 


Also Read: AP Bar Policy : ఏపీలో మద్యం బార్ల వేలానికి భారీ స్పందన, తిరుపతిలో రూ1.59 కోట్లు పలికిన బార్


Also Read: Rashtrapatni row: రాష్ట్రపతి హోదాకు జెండర్‌కు సంబంధం లేదా? అప్పట్లో నెహ్రూ ఏం చెప్పారు?