NDA Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ,  ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మధ్య జరిగిన  ఎక్స్ యుద్ధం చర్చనీయాంశమైంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన తో రాజ్యాంగంలోని అధికరణం 81, 1971 జనాభా లెక్కల ప్రాతిపదికను ఉటంకిస్తూ ఈ వాదోపవాదాలపై  పలువురు తమ వాదన వినపిస్తున్నారు. 

Continues below advertisement

చిదంబరం గణితానికి లోకేష్ రాజ్యాంగ కౌంటర్! 

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల బలం తగ్గిపోతుందంటూ  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. నా యువ మిత్రుడు నారా లోకేష్ కొంచెం లెక్కలు సరి చూసుకోవాలి  అంటూ  రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని మార్చకుండా పునర్విభజన చేపడితే, ఉత్తరాది రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన వాటి సీట్లు పెరుగుతాయని, తద్వారా దక్షిణాది రాష్ట్రాల  సాపేక్ష బలం దెబ్బతింటుందని ఆయన వాదించారు. బీజేపీ ప్రతిపాదించిన 50% సీట్ల పెంపు కేవలం ఒక భ్రమ అని, అది దక్షిణాది సీట్ల శాతాన్ని కాపాడలేదని చిదంబరం విశ్లేషించారు.

Continues below advertisement

 లోకేష్ ఘాటు స్పందన - కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు

చిదంబరం ట్వీట్‌కు నారా లోకేష్ అంతే దీటుగా సమాధానమిచ్చారు. రాజ్యాంగం ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్ల స్తంభన  2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల అనంతరం ముగుస్తుందని గుర్తు చేశారు. ఈ స్తంభన తొలగిన తర్వాత నియోజకవర్గాల మార్పు అనివార్యమని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకే ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు  ద్వారా సీట్ల సంఖ్యను దామాషా పద్ధతిలో పెంచాలని ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇంతటి మేధావి అయిన మీకు ఈ విషయం తెలియదా  దక్షిణాది ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకించింది  అంటూ లోకేష్ ఎదురుదాడికి దిగారు.

లోకేష్ కౌంటర్ కు షర్మిల స్పందించారు. నారా లోకేష్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. 

 అసలు వివాదం ఏమిటి? 

ఈ చర్చ అంతా ఆర్టికల్ 81 చుట్టూ తిరుగుతోంది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల కంటే, జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కడం వల్ల పార్లమెంటులో దక్షిణాది వాయిస్ తగ్గిపోతుందనేది ప్రధాన ఆందోళన. చిదంబరం వాదన ప్రకారం.. ఏపీకి సీట్లు పెరిగినా  దేశవ్యాప్తంగా పెరిగే సీట్లతో పోలిస్తే దక్షిణాది వాటా తగ్గుతుంది.   అసలు పునర్విభజన బిల్లునే వ్యతిరేకించడం వల్ల కాంగ్రెస్ దక్షిణాదికి ఎలా మేలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

 రాజకీయ సమీకరణాలు - భవిష్యత్తు సవాళ్లు   

ఈ ట్వీట్ల యుద్ధం కేవలం ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చ మాత్రమే కాదు,  ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, దక్షిణాది ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెబుతూనే, కేంద్రం ప్రతిపాదించిన మెకానిజమే పరిష్కారమని నమ్ముతోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులోని  మేథమెటికల్ ఇల్యూజన్ ను ఎత్తిచూపుతూ దక్షిణాది ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.