The Ghost Teaser:  


జపాన్‌ హిస్టరీతో లింక్..


కింగ్ నాగార్జున కొత్త మూవీ "The Ghost" మూవీ టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఓ పదునైన ఖడ్గాన్ని తయారు చేస్తూ చాలా సీరియస్‌గా కనిపించారు నాగ్. బీజీఎం కూడా ఎంతో ఇంటెన్స్‌గా అనిపించింది. ఈ ఎలిమెంట్స్‌తో పాటు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఈ టీజర్‌లో కనిపించింది. అదే "తమహగానే" (Thamahagane) అనే పదం. జపనీస్‌లో తమహగానే అంటే చాలా విలువైన ఉక్కు (Precious Steel).ఇది టీజర్ చివర్లో చూపించారు. ఈ స్టోరీలో ఈ ఖడ్గానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలియదు కానీ...జపాన్‌లో మాత్రం దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ దేశ చరిత్రను, ఆ విలువైన ఉక్కుని వేరు చేసి చూడలేం. ఇంతకీ ఈ ఉక్కుకి ఎందుకంత విలువ..? జపాన్‌లో మాత్రమే దొరుకుతుందా..? ఆ దేశ హిస్టరీకి ఈ స్టీల్‌కు లింక్ ఏంటి..? తెలుసుకుందాం. 


ఏంటీ దీని ప్రత్యేకత..? 


తమహగానే స్టీల్ చాలా అరుదైంది. జపాన్‌లో ఖడ్గాలు తయారు చేసే వాళ్లు మాత్రమే దీన్ని వినియోగిస్తారు. ఇందులో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే...కత్తులు చాలా షార్ప్‌గా తయారు చేసేందుకు వీలవుతుంది. ఉక్కులో కార్బన్ పెరిగే కొద్ది అది చాలా స్ట్రాంగ్‌గా, రఫ్‌గా తయారవుతుంది. తమహగానే (Thamahagane)స్టీల్‌లో 1-1.5% కార్బన్ ఉంటుంది. అయితే...ఈ కార్బన్ మోతాదు మరీ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. మితిమీరితే మరీ పెళుసుగా తయారవుతుంది. మరీ తక్కువైతే ఖడ్గం ఎడ్జ్ సరిగా తయారు చేయలేరు. అందుకే..చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఈ ఖడ్గాన్ని తయారు చేస్తారు. కేవలం ఈ ఖడ్గాల్ని తయారు చేసే ఎక్స్‌పర్ట్స్‌ జపాన్‌లో చాలా మందే ఉంటారు. వీళ్లని "Swordsmith" అని అంటారు. "Spirit Of The Sword" అనే బుక్‌లో ఈ కత్తిని తయారు చేసే విధానం గురించి ఎంతో వివరంగా రాశారు రైటర్ స్టీవ్ షాకిల్‌ఫార్డ్ (Steve Shackleford). సాధారణ స్టీల్‌ను తయారీతో పోల్చుకుంటే...తమహగానే స్టీల్‌ తయారీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అందులో చెప్పారు. 


ఎలా తయారు చేస్తారు..? 


ఈ మేకింగ్ ప్రాసెస్ ఎంతో కష్టంతో కూడుకున్నది. ముందుగా తతర (Tatara) అనే ఓ మట్టి పాత్రలో బొగ్గు, ఐరన్ సాండ్‌ని (అయస్కాంతం పొడి) కలిపి చాలా సేపు కరిగిస్తారు. 1800 డిగ్రీల ఫారన్‌హీట్‌ వద్ద వీటిని వేడి చేస్తారు.  ఇందులో రెండు రకాల ఐరన్‌ సాండ్‌ని వినియోగిస్తారు. అవి అకోమ్ (Acome),మస (Masa).వీటిని ఎంత కరిగిస్తే అంత క్వాలిటీ అవుట్‌పుట్ వస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే...ఈ ఐరన్ సాండ్‌ని ఎవరు పడితే వాళ్లు తీసుకొచ్చేందుకు వీలుండదు. దానికంటూ ప్రత్యేక స్కిల్స్‌ ఉన్న వాళ్లుంటారు. వాళ్లను "మ్యూరేజ్" (Murage) అని పిలుస్తారు. వాళ్లే ఐరన్ సాండ్‌ని సేకరిస్తారు. ఆ తరవాతే తమహగనే స్టీల్ తయారు చేస్తారు. లో కార్బన్ స్టీల్‌ను, హై కార్బన్ స్టీల్‌ను వేరు చేస్తారు. తరవాత ఖడ్గం షేప్‌ని అచ్చు పోస్తారు. ఈ ప్రాసెస్‌లో స్టీల్‌ని దాదాపు 16 సార్లు ఫోల్డ్ చేస్తారు. ఇలా చేయకపోతే ఖడ్గం పదునెక్కదు. ఈ ప్రాసెస్‌ అంతా పర్‌ఫెక్ట్‌గా చేస్తేనే తమహగానే కత్తి రెడీ అవుతుంది. ఇందుకు కనీసం మూడు రోజులు పడుతుంది. మామూలు ఖడ్గాలతో పోల్చి చూస్తే...తమహగనే స్టీల్‌తో తయారు చేసినవి ఎక్కువగా మెరిసిపోతుంటాయి. ఈ విలువైన స్టీల్‌ను ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోనే ఉంచుకుంటుంది. ఈ స్టీల్‌ని ఎగుమతి చేయటం అక్కడ నేరం. ఏడాదికి కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే ఈ స్టీల్‌ని వినియోగించి ఖడ్గాలు తయారు చేస్తారు. అప్పట్లో జపాన్‌ వారియర్స్ సమురాయ్‌ల కోసం ఈ ఖడ్గాలు ప్రత్యేకంగా తయారు చేసేవారు. "The Ghost" మూవీ టీజర్‌లో కూడా ఈ మేకింగ్ ప్రాసెస్‌ని చూపించారు.  



Also Read: The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!