రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 19 Aug 2022 06:51 PM
రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో జరిగిన ఘటనతో అలర్ట్ అయిన ఇంటర్‌బోర్డు కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది. ఏవో కారణాలు చెప్పి టీసీలు ఇవ్వకుండా ఆపొద్దని ఆదేశించింది. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్‌దేనని హెచ్చరించింది. ఇంటర్ అధికారులు రాష్ట్రంలోని కాలేజీలను సందర్శిస్తారని... ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం చర్యలు తప్పవని చెప్పింది. 

Hyderabad: రామాంతాపూర్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని, ప్రిన్సిపాల్‌ను గట్టిగా పట్టుకున్న విద్యార్థి

ఫీజు కట్టాలని వేధింపులు అధికం కావడంతో విద్యార్థి కీలక నిర్ణయం తీసుకున్నాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో పాటు ప్రిన్సిపాల్ ను పట్టుకోవడంతో ఇద్దరికీ తీవ్ర కాలిన గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని రామాంతాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఫీజులు కట్టాలని పదే పదే వేధిస్తుండటంతో ప్రిన్సిపాల్ గదికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న విద్యార్థి ప్రిన్సిపాల్ ను పట్టుకున్నాడు. 

Encounter in Telangana: భద్రాద్రి, ములుగు సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్, భారీగా ఆయుధాలు స్వాధీనం

ఉమ్మడి ఖమ్మం జిల్లా గుండాల-తాడ్వాయి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రాద్రి -ములుగు జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు మకాం వేశారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులను పోలీసులు చుట్టుముట్టారని సమాచారం. పోలీసుల కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి

కాకినాడలోని వాకలపుడిలో ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాకలపుడి షుగర్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి

కాకినాడలోని వాకలపుడిలో ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు. ఆరుగులు తీవ్రంగా గాయపడ్డారు. వాకలపుడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Pawan Mala: పవన్ మాల - దీక్ష స్వీకరించిన ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవన్ మాల’ పేరిట దీక్ష స్వీకరించారు. మెడలో ఎర్ర కండువా ధరించి 49 రోజుల దీక్షను మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. ఇది ఆయన 49వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ మాలధారణ చేసిన ఆయన అభిమానులు 49 రోజులపాటు దీక్ష చేస్తున్నారు.


పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. వీరంతా మెడలో ఎర్ర కండువాలు ధరించారు. జనసేనాని ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ 49 రోజులు ప్రయత్నిస్తామని వారు చెప్పారు

CBI Raids Manish Sisodia Home: సీబీఐకి వెల్ కమ్ అంటున్న మనీష్ సిసోడియా

ఢిల్లీలో పరిస్థితి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంలోని బీజేపీ అనేలా కనిపిస్తోంది. ఇటీవల ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లే జరుగుతోంది. ఇటీవల ఓ మంత్రిని అరెస్ట్ చేశారు. మా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. నేటి ఉదయం సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొందరు సీబీఐ అధికారులు ఆప్ నేత సిసోడియా ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. 

Lawyers Protest: న్యాయవాదులపై దాడులకు నిరసనగా లాయర్స్ ఆందోళన

కామారెడ్డి కోర్టు ఎదుట బైఠాయించిన లాయర్స్ 
41 ఏ సీఆర్పీసి చట్టాన్ని సవరించాలని డిమాండ్. 
 రాష్ట్రంలో న్యాయవాదులపై  జరుగుతున్న దాడులకు, హత్యలకు నిరసనగా కామారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. 
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, 41ఏ సిఆర్పిసి చట్టాన్ని సవరించాలని, రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను హత్యలను తీవ్రంగా ఖండిస్తూ. కామారెడ్డి జిల్లా బార్ సోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు అవరణలో  ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ కరువైందని, తరచుగా దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో  వామన్ రావు  దంపతులు, విజయ రెడ్డి, మొన్న జరిగిన మల్లారెడ్డి హత్య ఇలా నిత్యం లాయర్లను చంపేయటానికి. వెనుకాడటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ హత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు 41 (A),CRPC ని చట్టాన్ని సవరించాలని కోరుతున్నారు.

బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం

బాసర ట్రిపుల్ ఐటీ, మైలాపూర్  ప్రాంతంలో సంచారం. ఫిరోజ్ అనే వ్యక్తి చిరుతను చూశారు.


బాసర పరిసర ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతొంది. బాసర ట్రిపుల్ ఐటీ నుంచి మైలాపూర్ వెళ్లే దారిలో కోళ్ల వ్యాపారి ఫిరోజ్ అనే వ్యక్తి కి చిరుత కనిపించింది. ఈ విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో మైలాపూర్ గ్రామస్తుల్లో పొలాల్లోకి వెళ్లగా చిరుత సంతరించినట్లుగా గుర్తులు కనిలించాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. 
బైట్ : మైలాపూర్ గ్రామస్థుడు.

Background

ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం వాయువ్యవ దిశగా కదులుతూ తీవ్ర అల్పపడీనంగా నేడు బలపడనుంది. అనంతరం ఉత్తర బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 


అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 


ఇటీవల రాఖీ పౌర్ణమి పండుగ రోజు పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,250కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 అయింది. హైదరాబాద్‌లో రూ.900 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.62,400గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,250 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900 గా ఉంది. వెండి కేజీ ధర రూ.62,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం 18-08-2022 రోజున 70,674 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 35,930 మంది తలనీలాలు సమర్పించగా, 4.53 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో‌ నిండి పోవడంతో స్వామి వారి సర్వ దర్శనంకు 10 గంటల సమయం‌ పడుతుంది.‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కలియుగ దైవం శ్రీనివాసుడి తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో‌ మారుమోగుతోంది.


ఢిల్లీలో పరిస్థితి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంలోని బీజేపీ అనేలా కనిపిస్తోంది. ఇటీవల ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లే జరుగుతోంది. ఇటీవల ఓ మంత్రిని అరెస్ట్ చేశారు. మా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. నేటి ఉదయం సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొందరు సీబీఐ అధికారులు ఆప్ నేత సిసోడియా ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. 
మా ఇంటికి సీబీఐ వచ్చింది..

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.