అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ భౌగౌళిక మార్పులపై పరిశోధనలు.. వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఒక్కోసారి నిజమేనా.. అలా జరుగుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే తాజాగా అలాంటి పరిశోధనే ఒకటి బయటకి వచ్చింది. అదేంటో తెలుసా? భవిష్యత్తులో మన ముంబయి నగరంలో ఆఫ్రికా దేశమైన సోమాలియా భూభాగంలో కలిసిపోతుందట. షాకయ్యారా? ఇంకా చాలా ఉంది.
ఎలా సాధ్యం?
వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది జరిగి తీరుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి సంబంధించిన నివేదికను అమెరికన్ జర్నల్ ఆఫ్ సైన్స్‌లో ప్రచురించారు. కానీ ఇక్కడ వచ్చే సింపుల్ సందేహం ఏమిటంటే. ముంబయి నగరం.. ఆసియా ఖండంలో ఉంది. సోమాలియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. మరి ముంబయి నగరం జరిగి అక్కడికి వెళ్తుందా? అసలు నగరాలు, ఖండాలు జరిగిపోతాయా? అనేది అసలైన డౌట్. దానికి కూడా శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు.
250 మిలియన్ సంవత్సరాల కిందట భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేది. 50 మిలియన్ సంవత్సరాల తర్వాత భూభాగం చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడ్డాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత్ గొండ్వానా ఖండంలో భాగంగా ఉండేవి. అయితే ఈ ఖండంలోని ఆఫ్రికా తూర్పు భూభాగంలో మళ్లీ చీలికలు ఏర్పడ్డాయి. మరోవైపు భారత్ కాలక్రమంలో లారేసియాలోని ఆసియా ఖండంలో కలిసిపోయింది.
అనేక దేశాలుగా..
తదనంతర కాలంలో ఏడు ఖండాలు, అనేక దేశాలు ఆవిర్భించాయి. అయితే, ఇప్పటికీ అన్ని ఖండాల భూభాగాలు నెమ్మదిగా కదులుతూ మరో చోటుకు ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భారత పశ్చిమ భూభాగమైన ముంబయి నగరంతో ఆఫ్రికా తూర్పు భూభాగంలో ఉన్న పర్వతాలు, సొమాలియా రాజధాని మొగదిషు ప్రాంతాలు కలిసిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ఇరు ప్రాంతాల మధ్య ఉన్న అరేబియా సముద్రం ఉనికి కోల్పోతుందని.. ముంబయి నగరానికి సముద్ర తీరమే ఉండదంటున్నారు. అయితే, ఇది జరగడానికి 200 మిలియన్ సంవత్సరాలు పడుతుందట. వినడానికి వింతగా ఉన్నా.. అసలు అలా ఎలా సాధ్యమని మళ్లీ అనిపిస్తుంది కదా?
Also Read: China Zero Covid Strategy: అక్కడ అంతే.. ఎదిరిస్తే జైల్లోకి.. అనుమానమొస్తే బోనులోకి!
Also Read: Bikaner Guwahati Accident: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి