Morbi Bridge Collapse:


నాలుగు గంటల విచారణ..


మోర్బి వంతెన కూలిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అందుకు తగ్గట్టుగానే  చర్యలు మొదలయ్యాయి. మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్‌ సందీప్ సింగ్ జలా నుంచి నాలుగు గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణ పూర్తైన వెంటనే కీలక నిర్ణయం వెలువడింది. Urban Development Department సందీప్‌ సింగ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. State Disaster Commissioner హర్షద్ పటేల్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. గాలింపు చర్యల్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన హర్షద్ పటేల్..పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తరవాత సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని వెల్లడించారు. అయినా... ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలం వద్దే ఉంటారు. తదుపరి ఆదేశాలు అందే వరకూ అక్కడే అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. 


పోలీసులపై ఒత్తిడి..


మోర్బి వంతెన కూలిన ఘటనలో విచారణ వేగంగా సాగుతోంది. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం వల్ల పోలీసులు వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకుంటున్న మేనేజర్‌ సహా ఇతర సిబ్బందిని ఇప్పటికే విచారించారు. ఆ తరవాత మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సందీప్ సింగ్‌ను విచారించారు. దాదాపు 4 గంటల పాటు ఇది కొనసాగింది. స్థానిక కంపెనీ Orevaతో కుదిరిన ఒప్పందంపై ప్రశ్నించారు పోలీసులు. ఆ తరవాత లోకల్ కోర్ట్‌కు ఈ విచారణకు సంబంధించినడాక్యుమెంట్లు సమర్పించారు. ఇందులో తేలిందేంటంటే...ఈ బ్రిడ్జ్ మరమ్మతుల కోసం ఓ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అయితే...ఈ కాంట్రాక్టర్లకు బ్రిడ్జ్‌ను మరమ్మతు చేయటమెలాగో పూర్తి స్థాయిలో అవగాహన లేనే లేదు. అంతకు ముందెన్నడూ వాళ్లు అలాంటి పనులు చేయలేదు. కేవలం బ్రిడ్జ్‌కు ఉన్న కేబుల్స్‌ను పాలిష్ చేసి పెయింటింగ్ చేసి వదిలేశారు. ఈ కంపెనీ ఈ బ్రిడ్జ్‌ రిపేర్ చేయడానికి పూర్తిగా అనర్హం అని విచారణలో తేలింది. 


తుప్పు పట్టిన కేబుల్స్..


లోకల్‌ కోర్ట్‌లో విచారణ కొనసాగుతుండగా...డిప్యుటీ ఎస్‌పీ కోర్టుకు ఓ కీలక విషయం వెల్లడించారు. వంతెన వైర్లు తుప్పుపట్టి పోయాయని, వాటిని రిపేర్ చేయించి ఉంటే ప్రమాదం జరిగుండేదే కాదని వివరించారు. ఈ బ్రిడ్జ్‌ మెయింటేనెన్స్ చూస్తున్న మేనేజర్ దీపక్ పరేఖ్‌తో సహా 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ మేనేజర్‌ను విచారిస్తున్న సమయంలో కోర్టులో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది. "ఇలాంటి దుర్ఘటన జరగాలని దేవుడే కోరుకున్నాడేమో" అని ఆయన చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. వైర్లకు తుప్పు పట్టిందని, వాటికి కనీసం ఆయిల్ కూడా రాయలేదని డిప్యుటీ ఎస్‌పీ స్పష్టం చేశారు. నిందితులందరికీ10 రోజుల రిమాండ్ కోరిన డిప్యుటీ ఎస్‌పీ..కోర్టుకు మరి కొన్ని వివరాలు వెల్లడించారు. 


Also Read: Delhi Air Crisis: పూర్తి బాధ్యత వహిస్తాం, కేవలం మా వైపే వేలెత్తి చూపడం సరికాదు - కాలుష్యంపై కేజ్రీవాల్