Monkeypox Guidelines:


లక్షణాలుంటే వెంటనే చెప్పండి..


భారత్‌లో కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే
కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా చర్మంపై గాయాలున్న వారితో సన్నిహితంగా ఉండొద్దని వెల్లడించింది. స్మాల్‌పాక్స్‌ లాంటి లక్షణాలే మంకీపాక్స్ వైరస్‌ సోకిన వారిలో 
కనిపిస్తున్నాయని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. గతంలో పశ్చిమ, మధ్య ఆఫ్రికాలకే పరిమితమైన ఈ వైరస్..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
విస్తృతమవుతోంది. అమెరికా సహా పలు ఐరోపా దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లోనూ ఓ కేసు నమోదు కాగా...అంతర్జాతీయ ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.





 


ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..


ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. జ్వరం, దద్దులు, లాంటి సింప్టమ్స్‌ ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని చెప్పింది. ఇలాంటి లక్షణాలు వేరే వ్యక్తిలో కనిపించినా వెంటనే ఆరోగ్య సిబ్బందికి చెప్పాలని సూచించింది. పచ్చిమాంసం తినటాన్ని కొద్ది రోజుల పాటు మానుకోవాలని తెలిపింది. ఆఫ్రికాకు చెందిన లోషన్స్, క్రీమ్స్‌ వాడకూడదనిహెచ్చరించింది. ఇప్పటికే మంకీపాక్స్‌ సోకిన వ్యక్తి పక్కన నిద్రించటం, ఆ వ్యక్తి దుస్తులను ధరించటం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. బతికున్న లేదా, చనిపోయిన జంతువుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని చెప్పింది. భారత్‌లో హాల్‌బార్న్ వెల్స్ ఇండియా అనే సంస్థ పీసీఐర్ కిట్‌ను తయారు చేసింది. ఈ కిట్ సాయంతో మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించొచ్చు. కేవలం 90 నిముషాల్లో ఫలితాలు వెల్లడవుతాయి. 


Also Read: Agent Movie Teaser: అఖిల్ 'ఏజెంట్' టీజర్ - వైల్డ్ రైడ్ మాములుగా లేదుగా!