Monkey Football With Cricketers: కోతి చేష్టలు అని ఊరకనే అనరు... ఎందుకంటే కోతులు అలాంటి పనులే చేస్తాయి. మిగతా కోతుల సంగతేమో కానీ ఈ కోతి చేసిన పనిని చూస్తే.. నవ్వొచ్చినా .. కోపం వస్తుంది. పాపం పిల్లలు అనుకుంటారు. అసలేం జరిగిదంటే ?
కొంత మంది పిల్లలు ఓ గ్రౌండ్ లో సీరియస్ గా క్రికెట్ ఆడుతున్నారు. అంతా ఎవరి ఆటలో వారు బిజీగా ఉన్నారు. వారి దృష్టి అంతా బ్యాట్, బాల్ మీదనే ఉంది. అంతలో ఓ కోతి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గ్రౌండ్‌లోకి వచ్చేసింది. దాంతో ఆట ఆపేయాల్సి వచ్చింది. అయితే ఆ కోతి అక్కడి నుంచి వెళ్లలేదు. ఇప్పటిదాకా మీరు ఆడారు.. ఇక నుంచి నేను ఆడతాను అనుకుందేమో కానీ రంగంలోకి దిగింది.
అయితే కోతి క్రికెట్ ఆడాలనుకోలేదు.. ఫుట్ బాల్ ఆడాలనుకుంది. అక్కడ బాల్ లేదు. అందుకే ఆటగాళ్లనే బాల్స్ అనుకుంది. ఎగురుకుంటూ వచ్చి ఆటగాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేయడం ప్రారంభించారు. పిల్లలను ఎగిరి ఎగిరి తన్నింది. ఎంత బలంగా కొట్టిందంటే..ఇద్దరు , ముగ్గురు ఆటగాళ్లు.. రెండు, మూడు పల్టీలు వేసి అవతల పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ వీడియో ఎప్పటిది.. ఎక్కడ జరిగింది అన్న వివరాలు లేవు. బహుశా పాతది కావొచ్చని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఆటల గ్రౌండ్లలోకి అప్పుడప్పుడు జంతువులు, పాములు వచ్చిన సందర్బాలు ఉంటాయి. ఆటగాళ్లపై తేనేటీగలు దాడిచేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇలా ఓ కోతి పిల్లలపై దాడి చేయడం మాత్రం.. విచిత్రంగా ఉంది. అందుకే వైరల్ గా మారింది.