రైతులకు కేంద్రం చేసే సాయం నిధులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు మంగళవారం విడుదలకానున్నాయి. ఈ పథకానికి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు కేంద్రం జమ చేయనుంది. ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తోంది. 2024-25 ఏడాదికి సంబంధించిన తొలి విడత నిధులను మంగళవారం విడుదల చేయనున్నారు.
ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన రోజునే పీఎం కిసాన్ పెట్టుబడి సాయంపై మోదీ తొలి సంతకం చేశారు. 2018-19 నుంచి ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది కేంద్రం. తొలి విడత నిధులు మే- జూన్ నెల్లో ఇస్తే అక్టోబర్- నవంబర్‌లో రెండో విడత, జనవరి పిబ్రవరిలో మూడో విడత నిధులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 16 విడతల్లో రైతులకు సాయం చేశారు. ఇప్పుడు 17 విడతలో నిధులు విడుదల చేస్తున్నారు. పదహారు విడతల్లో మూడు లక్షల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఏ ఆర్థిక సంవత్సరంలో చేసే మొదటి విడత పీఎం కిసాన్ నిధుల విడదల ద్వారా 870 కోట్లు జమ చేయనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా తాము అధికారంలోకి వస్తే ఈ పెట్టుబడి సాయం పెంచుతామని చెప్పారు. ఆ నిధులను పీఎం కిసాన్ సమ్నాన్ నిధులతోపాటు విడుదల చేస్తారా లేకుంటే తర్వాత విడుదల చేస్తారా అని తెలియడం లేదు.
లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో చూశారా?
ఈ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కానున్నాయి. అలా డబ్బులు పడిన వెంటనే మొబైల్‌కి మెసేజ్ రానుంది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేయని వారిని ఈ జాబితా నుంచి తొలగించారు. అంతే కాదు సరైన పత్రాలు లేకపోయినా, చనిపోయిన రైతులను అనర్హులుగా తేల్చారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. ఈ టైంలో కొందరు అర్హుల పేర్లు కూడా పొరపాటున తీసేసే అవకాశం ఉంది . అందుకే అలా జరిగి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం కూడా చాలా సులభం. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ కి వెళ్తే... అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.
ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేస్తే నో యువ స్టాటస్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంట్ చేయాలి. తర్వాత ఓటీపీపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంట్ చేసి క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా వస్తుందని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేని వాళ్లు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. నో యూవర్ స్టాటస్ లోనే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ లేదా, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. అవి ఎంటర్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది.