Modi made key comments in Russia  : ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన  ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఒంటరిగా  రష్యాకు రాలేదని  140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో వచ్చానన్నారు.  భారత్‌ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని..  డిజిటల్‌ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించామన్నారు.   దేశం మరుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోందన్నారు. 


పదేళ్లలో ఆశ్చర్యపోయేంత అభివృద్ధి                        


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం..  పదేళ్లలో  ముఫ్పై వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం ..  పదేళ్లలో ఎయిర్‌ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించారు.  గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్‌ మాత్రమే .. అసలు అభివృద్ధి ముందు ముందు ఉంటుందన్నారు.  దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉందని..  సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉందన్నారు. 


మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్                   


ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ విజయాన్ని మీరు ఘనంగా జరుపుకున్నారు. విజయమే అంతిమ లక్ష్యం. భారత యువత చివరి క్షణం వరకు పట్టు వదలరని ప్రశంసించారు.  ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారని..  ఈ రోజు భారత్‌ చంద్రుని భాగంలోకి చంద్రయాన్‌ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను భారత్‌ కలిగి ఉందన్నారు.  డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రగామిగా కొనసాగుతోందని.. భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే   లక్ష్యమని ప్రకటించారు. 


రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోనున్న మోదీ                                                       


నెల రోజుల క్రితం  మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా మూడో టర్మ్‌లో మూడింతల శక్తితో పని చేస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశానని అని ప్రధాని మోదీ ప్రవాస భారతీయలగు గుర్తు చేశారు.    ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నారు,   ఫైటర్ జెట్ SU-57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.