Ambedkar statue in Vijayawada: రేపు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహా విష్కరణకు అందరూ హాజరు కావాలి అని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున వైయాస్ఆర్సీపీ సెంట్రల్ కార్యలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారు అని చెప్పారు.జాతి యావత్తూ గర్వించే ఏరియాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అంబేద్కర్ కోరుకున్న ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చు తున్నారని అన్నారు.  అంబేద్కర్ భావజాలం ఈ సమాజానికి ఉపయోగపడేలా చేయాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. 


 దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు


అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు అనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎక్కడో ముళ్ల పొదల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు అని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం అవసరమా? అని చంద్రబాబు అడగటం సిగ్గుచేటని, ఐదేళ్లు అధికారం ఉన్నా చంద్రబాబు కావాలనే అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని దుయ్యబట్టారు. నేషనల్ క్రైం రిపోర్టు చూస్తే చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్ని దాడులు జరిగాయో తెలుస్తుందని అన్నారు . కానీ సీఎం జగన్ పేద ప్రజలకు పునరంకితమై పని చేస్తున్నారని పేర్కొన్నారు.


సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలకు నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్ విగ్రహమని సంతనూతల ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. దళితుల ఆత్మగౌరవం అంబేద్కర్ అని ఉద్ఘాటించారు