Minister Gudivada Amarnath Emotional in Anakapally: అనకాపల్లిలో బుధవారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఉద్వేగ భరితమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా కార్యకర్తల్లో, నాయకుల్లో భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. మంత్రి అమర్నాథ్ కూడా తన ప్రసంగంలో అనేక సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి ఇన్చార్జిగా మలసాల భరత్ కుమార్ ను పార్టీ కేడర్ కు పరిచయం చేయటంతో పాటు, ఇప్పటివరకు తనను ఆదరించిన అనకాపల్లి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో బుధవారం భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ... "నా గుండె బరువు ఎక్కింది.. నాకు నా కుటుంబ సభ్యులు ఇప్పటికే నన్ను ఓదార్చారు.. కానీ అనకాపల్లి ప్రాంత ప్రజలు నాపై చూపిన అభిమానాన్ని, ఆప్యాయతను మర్చిపోలేక బాధను దిగమింగుకుంటున్నాను. 


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంది. ఆయన ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలి. ఇప్పటివరకు నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్న మీ రుణం ఎప్పటికీ తీర్చుకో లేను. లక్ష్యసాధనలో నేను ఎక్కడ పని చేసిన, మీలో ఒకనిగా ఉంటానని హామీ ఇస్తున్నా’’నంటూ మంత్రి అమర్నాథ్  భావోద్వేగానికి గురి అయ్యారు. కళ్ళ వెంట వస్తున్న నీటిని అదుపు చేసుకుంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.


అప్పుడు నా భవిష్యత్తు ఏంటో కూడా తెలీదు
2014 ఎన్నికల తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలియదు దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాలో విశ్వాసాన్ని నింపి, లక్షలాదిమంది కార్యకర్తలను అండగా నిలిపి, ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచేలా చేశారని మంత్రి అన్నారు. ఒక దశలో పార్టీ తీవ్ర కష్టాల్లో ఉండేదని, అటువంటి సమయంలో తనను ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను తనకు అప్పగించారని ఆయన తెలియజేశారు. 2014లో తాను ఓడిపోయినప్పుడు తన కుటుంబ సభ్యులు తనకు మనోధైర్యాన్ని కల్పించి రాజకీయాల్లోని కొనసాగమని సూచించారని అమర్నాథ్ చెప్పారు. కష్టపడితే ఫలితం లభిస్తుందని అనడానికి తానే ఒక ఉదాహరణ అని, పార్టీలో అంతంత మాత్రమే ఉన్న నాయకులను కూడగట్టుకుని ముందుకు సాగానని ఆయన తెలియజేశారు. అప్పట్లో కార్యకర్తలు తన వద్దకు రావడానికి భయపడే వారిని కేవలం పదుల సంఖ్యలో ఉండే వీరి సంఖ్యని, లక్షల సంఖ్యకు చేర్చడానికి సమయం పట్టిందని దీనికి కూడా అనకాపల్లి ప్రజలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా కుటుంబ సభ్యుల కారణమని అమర్నాథ్ స్పష్టం చేశారు.


నేనేం పట్టించుకోవట్లేదు - గుడివాడ
రెండో విడత జాబితాలో  తన పేరు రాలేదంటూ కొన్ని పత్రికలు, చాన్నాళ్లు సంబరపడి వార్తలు ప్రకటించాయని వాటిని తాను ఏమాత్రం పట్టించుకోవటం లేదని, తనకు పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం శ్రమిస్తానని, పార్టీలో శాశ్వతంగా నిలిచేది కార్యకర్తలని, ఒక కార్యకర్తలా జండా పట్టుకుని పని చేయడానికి కూడా తన సిద్ధంగా ఉన్నానని అమర్నాథ్ చేశారు. పార్టీ అధికారంలో ఉంటే వాడుకుని, ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీని వెళ్లిపోయే వారిని నమ్మద్దని అటువంటి వారు పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటేనని అమర్నాథ్ చెప్పారు. 
తాను పార్టీ సమన్వయకర్తగా ఒక ఎమ్మెల్యేగా అత్యున్నత శాఖలతో కూడిన మంత్రి పదవిని చేపట్టినా, కొంతమందికి ఉపకారం చేయలేకపోయినా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అమర్నాథ్ చెప్పారు. తాను ఇతర జిల్లాలకు చెందిన వాడిని కాదని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాడనని.. మీ వాడినని అమర్నాథ్ అనడంతో కార్యకర్తలంతా కంటతడి పెట్టారు.