వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు...తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుడికాలు లాగడంతో సహచరులు...వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు...మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ గా నిర్దారించారు. వైద్యుల సూచన మేరకు...మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ కు తరలించారు. టెస్టులు చేసిన డాక్టర్లు మూడు రోజుల పాటు అబ్జ్వరేషన్ లో పెట్టారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆరోగ్యం ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని...విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.
కొండేటి చిట్టిబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... పి.గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి...టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై 22,207 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.