Microsoft Salary Hikes: 


హైక్‌లు ఉండవని మెయిల్..? 


మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హైక్‌లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పింది. బోనస్‌లు, స్టాక్‌ అవార్డులకు సంబంధించిన బడ్జెట్‌లోనూ కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల ఈ మేరకు అందరికీ మెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది. అయితే..దీనిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఆ సంస్థ స్పందించలేదు. Reuters రిపోర్ట్ ప్రకారం మాత్రం సత్య నాదెళ్ల పేరుతో ఉద్యోగులందరికీ మెయిల్స్ అందాయి. 


"గతేడాది మార్కెట్ కండీషన్స్‌ని తట్టుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. కంపెనీ పెర్‌ఫార్మెన్స్‌ని పెంచేందుకూ ఖర్చు చేశాం. గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌కి రెండింతలు ఖర్చు పెట్టాం. కానీ ఈ సారి ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాలేవు. చాలా విభాగాల్లో సమస్యలున్నాయి. అందుకే...ఈ సారి హైక్‌లు క్యాన్సిల్ చేస్తున్నాం. బోనస్‌లలోనూ కోత పడే అవకాశాలున్నాయి"


- ఉద్యోగులకు సీఈవో సత్యనాదెళ్ల మెయిల్ (Reuters రిపోర్ట్ ప్రకారం)


లేఆఫ్‌లు..


ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. HR సహా ఇంజినీరింగ్ విభాగంలో వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమవు తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5% మేర ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే అమెజాన్, మెటా భారీ సంఖ్యలో లేఆఫ్‌లు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కుదుపుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్యోగులను తొలగించక తప్పడం లేదని చెబుతున్నాయి టెక్‌ సంస్థలు. మైక్రోసాఫ్ట్ సంస్థ...దాదాపు 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. Reuters న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే విషయం వెల్లడించింది. ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువ మొత్తంలో లేఆఫ్‌లు ఉండనున్నాయి. గతేడాది కన్నా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. అయితే...ఎప్పటి నుంచి ఈ లేఆఫ్‌లు మొదలు పెడతారన్నది క్లారిటీ ఇవ్వకపోయినా...వచ్చే వారం నుంచి మొదలవుతాయని సమాచారం. ఇప్పటికి ఉన్న లెక్కల ప్రకారం..మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో 2 లక్షల 21 వేల మంది ఉద్యోగులు న్నారు. వీరిలో లక్షా 22 వేల మందికి పైగా అమెరికాలోనే ఉన్నారు. ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు లేకపోవడం వల్ల కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. చిన్న స్థాయి ఉద్యోగులను గతేడాదే తొలగించారు.


గతేడాది కూడా..


అంతకు ముందు మైక్రోసాఫ్ట్‌ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్‌లలో కలిపి 1800 మంది ఉద్యోగులను తొలగించింది. స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కొన్ని రోల్స్‌లో నుంచి ఉద్యోగులను తీసేస్తామంటూ గతేడాది జూన్ లో ప్రకటించింది మైక్రోసాఫ్ట్. వీరి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకుంటామని తెలిపింది. వీలైనంత ఎక్కువ మందిని ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేసింది. "మేము కొంత మందిని మాత్రమే తొలగించాం. అన్ని సంస్థల్లాగే మేమూ మా  బిజినెస్‌ ఎలా సాగుతోందో అనలైజ్ చేసుకుంటాం. అందుకు తగ్గట్టుగా ఉద్యోగుల సంఖ్యను అడ్జస్ట్ చేస్తాం" అని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. సంస్థలో మొత్తం 1.8 లక్షల మంది ఉద్యోగులున్నారని వారిలో 1% మందిని మాత్రమే తొలగించినట్టు గుర్తు చేస్తోంది. 


Also Read: Uddhav Thackeray: ఏ మాత్రం నైతికత ఉన్నా షిందే రాజీనామా చేయాలి - ఉద్ధవ్ థాక్రే డిమాండ్