Hyderabad Fans welcomed Messi: ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇండియా టూర్ 2025 రెండో దశకు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 4:30 గంటల సమయంలో చేరుకున్న మెస్సీ, నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. ఈ ఐ ప్యాలెస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా స్వాగతం అందించారు.
ఫలక్ నుమాలో 10 లక్షల రూపాయలు చెల్లించిన 100 మంది అభిమానులతో మీట్-అండ్-గ్రీట్ సెషన్‌లో పాల్గొన్నారు.
కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న మెస్సీకి విమానాశ్రయంలో భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. అతనితో పాటు ఇంటర్ మియామీ సిఎఫ్ టీమ్‌లోని రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా వచ్చారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన స్వాగత సమ్మేళనంలో మెస్సీకి తెలంగాణ సంస్కృతి ప్రకారం పారంపరిక వస్త్రాలు, గులాబీలు అందజేశారు.
ఈ మీట్-అండ్-గ్రీట్ సెషన్‌కు టికెట్ ధర ₹9.95 లక్షలు. ఇందులో మెస్సీతో సింగిల్ ఫోటో సెషన్, సంతకాలు, ప్యాలెస్ డిన్నర్ ఉన్నాయి. ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోతోంది.