Meghalaya Political Crisis:


మేజిక్ ఫిగర్‌ రాలేదు..


మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో National People's Party (NPP) 26 స్థానాలు దక్కించుకుంది. 59 నియోజకవర్గాలున్న మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 30. అయితే...NPP మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోయినప్పటికీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతుని  BJP ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు సంగ్మా. 


"మాకు బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తోంది. NPPనేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని గవర్నర్‌ను కలుస్తాం. బీజేపీతో పాటు అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలబడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం మాకుంది. అయితే ఏయే పార్టీలు మాతో కలిసి వస్తాయన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా,ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్లు హాజరవుతారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది."


కొన్రాడ్ సంగ్మా, మేఘలాయ ముఖ్యమంత్రి 










ఫలితాల తరవాత రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపైనా స్పందించారు సీఎం సంగ్మా. 


"ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కొన్ని చోట్ల హింస చెలరేగింది. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి. రాజకీయ పార్టీలు, ప్రజలకు నేను చెప్పేది ఒకటే. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకండి"


కొన్రాడ్ సంగ్మా, మేఘలాయ ముఖ్యమంత్రి 






సంగ్మా నేతృత్వంలోని NPP రెండోసారి మంచి మెజార్టీతో విజయం సాధించింది. అటు బీజేపీ మాత్రం గట్టిగానే పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా విఫలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చి ప్రచారం చేసినా కేవలం 2 సీట్లకే పరిమితమైంది. 


Also Read: Holi 2023: హోళి వేడుకల్లో పిచ్చి పాటలు పెట్టొద్దు, గీత దాటితే వాత పెడతాం - యోగి ఆదిత్యనాథ్