UPSC Civil Services Examination: సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే చాలా కొద్ది మందికే .. అదీ కూడా ఎంతో కష్టపడిన తర్వాత లభించే అవకాశం. ఎన్నో ఎత్తుపల్లాలను చూడాల్సి ఉంటుంది. వాటన్నింటిని తట్టుకుంటేనే సంచలనాలు నమోదు చేయవచ్చు. ఇటీవల ట్వల్త్ ఫెయిల్ అనే ఓ సినిమా ఓటీటీలో వచ్చింది. విక్రాంత్ మాసే హీరో. ఆయన ఓ కుగ్రామం నుంచి ఐఏఎస్ సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చూస్తే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. అలాంటి స్ఫూర్తి దాయక కథలెన్నో ర్యాంకర్ల జీవితాల్లో ఉంటాయి.
2021 సివిల్స్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన యువతి శ్రుతి శర్మ. ఈమెకు ఈ విజయం ఆషామాషీగా రాలేదు. 2020లో పరీక్ష రాసిన తర్వాత ఎంతో నమ్మకంతో ఇంటర్యూ కాల్ వస్తుందని అనుకుంది. కానీ ఆమెకు ఒక్కటంటే ఒక్క మార్కులో ఇంటర్యూ కాల్ మిస్ అయింది. దీంతో ఆమె తీవ్రంగా వేదన చెందారు. ఒక్క మార్క్ విలువ ఏడాది కాలం అని ఆమెకు తెలుసు. అయితే అంతటితో వదిలేయాలని అనుకోలేదు. పట్టుదలగా ప్రయత్నించి అనుకున్నది సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏడాదిపాటు కష్టపడ్డారు. ఒక్క మార్క్‌తో పోయిన ఇంటర్యూ ఈ సారి సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి స్ఫూర్తిగా నిలిచింది.
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
ఢిల్లీలోని స్టీఫన్స్ కాలేజీలో చదువుకున్న శ్రుతి శర్మ.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ర కు చెందినవారు. హిందీ మీడియంలో చదువు కోవడం వల్ల.. ఇబ్బంది పడ్డారు. మెయిన్స్ ఎగ్జామ్‌ను హిందీలోనే పూర్తి చేశారు. అయినప్పటికీ మొదటి ర్యాంక్ ను తెచ్చుకున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆమె స్కోరు 54.75 శాతం. సొంతగా నోట్స్ తయారు చేసుకోవడం.. ప్రశ్నలు, సమాధానాలను సొంతంగానే ప్రిపేర్ చేసుకవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధించవచ్చిని శ్రుతి శర్మ సలహాలిస్తున్నారు. కరెంట్ ఆఫైర్స్ మీద ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు వెబ్ సైట్స్, పేపర్స్ చదవడమే కాదు.. ఆన్ లైన్ టెస్ట్ సిరీస్‌ను ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. ఈ టెస్టులన్నీ పరీక్షల్లో బాగా స్కోర్ చేయడానికి ఉపకరిస్తాయని అంటున్నారు.
ఒక్క శ్రుతి శర్మ మాత్రమే కాదు యూపీఎస్సీలో ర్యాంక్ సాధించిన ప్రతి ఒక్కరి కష్టాలను తెలుసుకుంటే.. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన దారిలో నడవకపోతే.. ర్యాంకులు సాధించడం కష్టంగా మారుతుంది. ఒక్క మార్కులో ఇంటర్యూ మిస్ అయిన శ్రుతి శర్మ.. అప్పట్లో టాలెంట్ లేక ఆ మార్కులు తెచ్చుకోలేక కాదు కానీ ప్రణాళిక లేకపోవడం వల్ల ఇంటర్యూకు సెలక్ట్ కాలేకపోయింది. ఆ తప్పును తర్వాత దిద్దుకోవడంతో మొదటి ర్యాంక్ వచ్చింది.