Meerut woman elopes with brother in law : భార్య చెబితే వినాలి. ఇష్టం లేకపోయినా పాటించాలి. లేకపోతే పరువు పోతుంది. దానికి ఈ మీరట్ మొగుడే సాక్ష్యం. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ అర్షి, తన భర్త మొహమ్మద్ షకీర్ గడ్డం తీయడానికి నిరాకరించడంతో, అతని తమ్ముడు మొహమ్మద్ సబీర్‌తో వెళ్లిపోయింది. ఈ సంఘటన లిసారీ గేట్ ప్రాంతంలోని ఉజ్వల్ గార్డెన్ కాలనీలో జరిగింది.
మౌలానాగా పని చేస్తున్నందున గడ్డం పెంచుకున్న షకీర్
మొహమ్మద్ షకీర్ మౌలానా గా పనిచేస్తున్నారు. ఇన్చోలీకి చెందిన 25 ఏళ్ల అర్షితో అక్టోబర్ 2024లో పెళ్లి జరిగింది. వీరు షకీర్ తల్లి , తమ్ముడు సబీర్‌తో కలిసి ఉజ్వల్ గార్డెన్ కాలనీలో నివసిస్తున్నారు. వివాహం తర్వాత, షకీర్ గడ్డం పెంచుకోవడాన్ని భార్య అర్షి వ్యతిరేకించింది. ఆమె అతన్ని గడ్డం తీసి క్లీన్-షేవ్‌గా ఉండమని పదేపదే కోరింది. ఈ వివాహం కుటుంబ ఒత్తిడి కారణంగా జరిగిందని, షకీర్ గడ్డం తీయకపోతే తాను అతనితో కలిసి జీవించలేనని పలు మార్లు వాదనలకు దిగింది.
గడ్డం తీయడం లేదని షకీర్ సోదరుడితో కలిసి వెళ్లిపోయిన ఆర్షి
2025 ఫిబ్రవరి 3న, అర్షి తన వ్యక్తిగత వస్తువులతో సహా ఇంటి నుండి అదృశ్యమైంది. షకీర్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతని తమ్ముడు సబీర్ కూడా అదే సమయంలో లేనట్లు గుర్తించాడు. దీంతో అర్షి తన బావ సబీర్‌తో పారిపోయినట్లు షకీర్ గుర్తించాడు. తమ్ముడితో తన భార్య వెళ్లిపోయిన తర్వాత షకీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్షి తన గడ్డం వల్ల అతని రూపాన్ని ఇష్టపడలేదని, ఒకవేళ గడ్డం తీయకపోతే తనను వదిలేస్తానని హెచ్చరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరుడు నీట్ గా షేవ్ చేసుకుంటాడని తెలిపారు.
తన కూతురు ఇష్టంలో జోక్యం చేసుకోలేమన్న ఆర్షి తల్లిదండ్రులు
షకీర్ లిసాడీ గేట్ పోలీస్ స్టేషన్‌లో తన భార్య అర్షి ,తమ్ముడు సబీర్‌లు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అతను వారి ఫోన్ నంబర్‌లను పోలీసులకు అందించాడు.ఈ అంశంపై అర్షి తల్లిదండ్రులను సంప్రదించాడు, కానీ వారు జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. తమ కుమార్తె ఇష్టప్రకారం వెళ్లిపోయిందని బలవంతంగా తీసుకు వచ్చి మళ్లీ షకీర్ వద్ద ఉంచడానికివారు ఇష్టపడలేదు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మౌలానా అయిన షకీర్ రోజంతా తీరిక లేకుండా ఉంటారు. ఇంట్లో ఆయన సోదరుడు ఉంటారు. అలా పరిచయం పెరిగి.. నీట్ షేవ్ తో ఉండే.. షకీర్ సోదరుడితో జీవితం పంచుకునేందుకు వెళ్లిపోయారు. సమాజం ఏమనుకుంటే.. మాకేంటని వారు ఫీలయ్యారు.