Meat and Eggs are Illegal Here The Worlds First Vegetarian City : దేవదేవుడు వేంచేసి ఉన్న తిరుమలలో మాంసాహారం మాత్రమే కాదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న దేన్నీ అంగీకరించరు. అయితే ప్రపంచంలోని మొట్టమొదటి శాకాహార నగరం మాత్రం తిరుమల కాదు. గుజరాత్ లోని భావననగర్ జిల్లాలో ఉన్న పాలితానా నగరం మొట్టమొదటి శకాహారనగరం. అక్కడ మాంసాహారమే కాదు..ఎగ్స్ కూడా పూర్తిగా నిషేధం. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతారు.
జైనులు అత్యంత పవిత్రంగా భావించే నగరం పాలితానా
అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే పాలితానా నగరం అధ్యాత్మికంగా ఎంత ప్రముఖమైనదో చెప్పాల్సిన పని లేదు. శతృంజయ కొండల చుట్టూ విస్తరించిన ఈ పట్టణాన్ని ‘జైన్ టెంపుల్ టౌన్’గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడ దాదాపు వెయ్యి ఆలయాలు ఉన్నాయి. అందులో ఆదినాథ్ ఆలయం ఫేమస్. జైనమత ఆచారాల్లో అహింస అత్యంత ముఖ్యమైనది. జైనులు ఆచార వ్యవహారాలను చాలా పక్కాగా పాటిస్తారు. చాలా మంది అక్కడికి పర్యాటకులుగా వస్తుంటారు. జైనుల సంప్రదాయాలను గౌరవిస్తూ నాన్ వెజ్ బ్యాన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
Also Read: భారతీయుల్ని రానివ్వకపోతే టెక్నికల్‌గా దివాలా తీస్తాం - ట్రంప్‌ను హెచ్చరిస్తున్న మస్క్, రామస్వామి !
గుజరాత్మలో ద్యం నిషేదం - మాంసాహారులు అతి తక్కువ !
దేశంలో శాఖాహారుల రాష్ట్రం గుజరాత్. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మాంసాహానికి, మద్యానికి వ్యతిరేకం. గుజరాత్ లో మద్యం కూడా అమ్మరు. ఇప్పుడు కాదు 1960 నుంచి గుజరాత్ లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. ప్రజలు దాన్ని పాటిస్తున్నారు. అయితే అధికారికంగా మాంసాహారంపై నిషేధం విధించిన నగరం మాత్రం పాలితానానే. అలాగే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కూడా మాంసాహార విక్రయంపై నిషేధం విధించారు. జంతు మాంసంతో చేసిన ఆహారాన్ని తయారు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో దాన్ని విక్రయించడం కూడా నేరం. వదోదర, జునాగఢ్, అహ్మదాబాద్ వంటి పట్టణాల్లోనూ ఇదే తరహా నిబంధనలు కొనసాగుతున్నాయి. అయితే పాలితానా తరహాలో మాంసం విక్రయంపై పూర్తిస్థాయి నిషేధం మాత్రం విధించలేదు.
తిరుమలలో కూడా నిషేధం - ఇంకా సిటీగా గుర్తించలేదు
తిరుమలలో కూడా నిషేధం ఉన్నా.. ఇంకా తిరుమలను ఓ సిటీగా గుర్తించలేదు. అందుకే ఓన్లీ వెజ్ సిటీగా గుర్తింపు పొందలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది. తిరుమలను ఓ ప్రత్యేకమైన అధ్యాత్మిక నగరంగా ప్రకటించాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.
Also Read : Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !