Delhi MCD Election Results: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మెజార్టీ మార్క్ 126ను దాటి 134 వార్డుల్లో కేజ్రీవాల్ పార్టీ గెలుపొందింది. మరోవైపు భాజపా 104 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలను సాధించింది.
ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపుపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సంబరాలు
ఆమ్‌ఆద్మీ విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది. మరోవైపు ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది.
దిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఎగ్జిట్ పోల్
అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు MCD పీఠం ఆప్‌దేనని స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా భాజపా చేతిలోనే ఉన్న్ MCDని ఈసారి ఆప్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. 250 వార్డులకు గాను ఆప్ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఆప్ మెజార్టీ మార్క్ దాటి 134 వార్జుల్లో గెలుపొందింది.
Also Read: German Foreign Minister: ఆగండి నేను పేటీఎమ్ చేసేస్తాను, షాప్ ఓనర్‌కు జర్మన్ మంత్రి షాక్