Delhi MCD Election 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. అవినీతికి పాల్పడే వారికి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో కేజ్రీవాల్ మాట్లాడారు. దిల్లీని క్లీన్ చేయడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశమన్నారు.
మొత్తం 250 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 1,349 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్‌లో 1.45 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటర్లు ఉన్నారు. భాజపా, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. దిల్లీలో ఆప్, భాజపా హోరాహోరీ ప్రచారం చేశాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.
భాజపా ఆగ్రహం
మరోవైపు ఓటింగ్ ప్రక్రియపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని వార్డుల్లో భాజపా మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించింది.
Also Read: Viral Video: వైరల్ వెడ్డింగ్- పెళ్లికి వచ్చే వారి కోసం ఏకంగా విమానం బుక్ చేశారు!