Maruti Suzuki New Offer Saves Buyers From Latest Price Hike: కార్ల ధరలు పెరుగుతున్న తరుణంలో మొదటిసారి కారు కొనాలనుకునే మిడిల్ క్లాస్ కస్టమర్ల కోసం మారుతి సుజుకి ఒక అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో మోడళ్లను జూన్ 14, 2026 లోపు బుక్ చేసుకునే వారికి ఈ ప్రైస్ ప్రొటెక్షన్ ఆఫర్ వర్తిస్తుంది. దీనివల్ల రీసెంట్‌గా పెరిగిన ధరల భారం కస్టమర్లపై పడదు. జూన్ 2026 నుంచి ఇన్‌పుట్ కాస్ట్స్ పెరగడం వల్ల మారుతి సుజుకి తన కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఈ డెడ్‌లైన్ లోపు బుక్ చేసుకుంటే, వెహికల్ డెలివరీ లేట్‌గా అయినా సరే పాత ధరలకే కారును సొంతం చేసుకోవచ్చు అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Continues below advertisement

Read Also: Best SUV Sales In May 2026: ఎస్‌యూవీ కొనుగోళ్లలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా నెంబర్ వన్.. టాప్ 5 కార్ల లిస్ట్ చూశారా

బడ్జెట్ కార్ల మార్కెట్ రికవరీఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ టూ వీలర్ నుంచి కారుకు అప్‌గ్రేడ్ అవ్వడానికి ఆల్టో కే10, వ్యాగన్ఆర్ లాంటి హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గత కొంతకాలంగా స్లోడౌన్ చూసిన ఈ స్మాల్ కార్ సెగ్మెంట్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందని కంపెనీ తెలిపింది. దీనివల్ల మారుతి సుజుకి మార్కెట్ షేర్ దాదాపు 300 నుంచి 400 బేసిస్ పాయింట్లు పెరిగింది. సడన్ ప్రైస్ హైక్ వల్ల బడ్జెట్ కస్టమర్లు నిరాశ పడకూడదనే ఉద్దేశంతో డీలర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ప్రైస్ ప్రొటెక్షన్ డెసిషన్ తీసుకున్నట్లు మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పష్టం చేశారు. మరోవైపు మారుతి సుజుకి ప్రకటించిన ఈ ఆఫర్ వల్ల నిర్ణీత సమయంలో కొనుగోలు చేసేవారికి ధరఘాతం ఉండబోదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Continues below advertisement

Read Also: Renault  Massive Discounts: రెనాల్ట్ కార్లపై కళ్లుచెదిరే ఆఫర్స్, జూన్ 15 లోపే లాస్ట్ ఛాన్స్.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూసుకోండి!

సుహానా సఫర్ ఫైనాన్స్ ప్లాన్ప్రైస్ ప్రొటెక్షన్‌ తో పాటు మారుతి సుజుకి 'సుహానా సఫర్' పేరుతో ఒక ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కారు కొనడాన్ని మరింత ఈజీ చేయడం కోసం ఈ స్ట్రక్చర్డ్ సేవింగ్స్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం కస్టమర్లు ఒక రికరింగ్ డిపాజిట్ (R D) అకౌంట్ ఓపెన్ చేసి, ప్రతి నెలా ఈఎమ్‌ఐ లాంటి ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌ను అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. . మూడు నుంచి ఆరు నెలల పాటు ఇలా సేవ్ చేసిన తర్వాత, ఆ టోటల్ అమౌంట్‌ను కారు లోన్ కోసం డౌన్ పేమెంట్‌గా వాడుకోవచ్చు. ఈ స్మార్ట్ ప్లాన్ వల్ల లోన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది.