Manipur Bus Accident: మణిపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు విద్యార్థులు మృతి!

Manipur Bus Accident: మణిపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురైంది.

Continues below advertisement

Manipur Bus Accident: మణిపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.

Continues below advertisement

ఇలా జరిగింది

నోనీ జిల్లాకు చెందిన థంబాల్ను స్కూల్‌ విద్యార్థులు రెండు బస్సుల్లో స్టడీ టూర్‌కు వెళ్లారు. అయితే మార్గమధ్యంలో లాంగ్‌సాయ్‌ ప్రాంతంలో అమ్మాయిలు ప్రయాణిస్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది. మలుపులో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు జారి బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలంలో ఎస్డీఆర్ఎఫ్‌ బృందం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారని సమాచారం.. అయితే 15 మంది మృతిచెందినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరణాలపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం దిగ్భ్రాంతి

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన.. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు.

Continues below advertisement